![]() |
![]() |

నెల రోజుల గ్యాప్ లో లేడీ డైరెక్టర్ సుధ కొంగర.. ఓటీటీ వేదిక గా రెండు విజయాలను చూశారు. దర్శకురాలిగా తన స్థాయిని మరింత పెంచుకున్నారు.
ఆ వివరాల్లోకి వెళితే.. లాక్ డౌన్ లో జరిగే ఐదు విభిన్న కథలతో తెరకెక్కిన ఆంథాలజీ పుతమ్ పుదు కాలై లో తొలి ఎపిసోడ్ (షార్ట్ ఫిల్మ్) అయిన ఇళమై ఇదో ఇదో ని సుధ కొంగర డైరెక్ట్ చేశారు. జయరామ్, ఊర్వశి, కాళిదాస్ జయరామ్, కళ్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ ఎపిసోడ్ కి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అక్టోబర్ 16 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో పుతమ్ పుదు కాలై స్ట్రీమ్ అవుతోంది. ఇక ఇదే ఓటీటీ ప్లాట్ ఫామ్ లో నవంబర్ 12 నుంచి స్ట్రీమ్ అవుతున్న సూరరై పోట్రు (ఆకాశం నీ హద్దురా)కి కూడా సుధనే దర్శకురాలు అన్న సంగతి తెలిసిందే. సూర్య, అపర్ణ బాలమురళి, ఊర్వశి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఓటీటీలో సిసలైన బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
మొత్తమ్మీద.. నెల రోజుల గ్యాప్ లో సుధ ఓటీటీ వేదికగా తన ప్రతిభ చాటుకున్నారన్నమాట.
విశేషమేమిటంటే.. ఈ రెండింటిలోనూ నటి ఊర్వశి కీలక పాత్రలో నటించగా.. జీవీ ప్రకాష్ స్వరాలు సమకూర్చారు. నికేత్ బొమ్మి ఛాయాగ్రహణం అందించారు.
![]() |
![]() |