![]() |
![]() |
.jpg)
ఫిక్స్డ్ డిపాజిట్లు, బాండ్లు, మ్యూచ్‌వల్ ఫండ్స్‌లలో పెట్టుబడులు పెట్టేవాళ్లెందరో. బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ సైతం ఇలాంటి వాటిలో పెట్టుబడులు పెట్టింది. అయితే ఆమెలోని వ్యాపార చతురతకు దీన్ని నిదర్శనంగా చూపించలేం. కాకపోతే వ్యాపారాల్లో రిస్క్ తీసుకొనేవారి నుంచి ఆమెను ఇది వేరు చేసి చూపిస్తుందని చెప్పగలం. సురక్షితంగా ఉండే వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఇష్టం చూపించే ఆలియా ఒక ఇండియన్ రిటైల్ వెబ్సైట్లో పెట్టుబడులు పెట్టిందని చాలా మందికి తెలీదు.
ఎంతనేది వెల్లడి కాలేదు కానీ, ఇటీవలి రిపోర్టుల ప్రకారం.. ఫ్యాషన్-బ్యూటీ ఇ-కామర్స్ వెబ్సైట్ అయిన నైకాలో పెద్ద మొత్తంలోనే ఆలియా పెట్టుబడులు పెట్టింది. మరో టాప్ యాక్ట్రెస్ కత్రినా కైఫ్‌కు సైతం ఈ వెబ్సైట్లో పెట్టుబడులు ఉన్నాయి. బహుశా ఆమె ప్రేరణతోటే ఆలియా ఇందులో ఇన్వెస్ట్ చేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2012లో నైకా తన ఇ-కామర్స్ బిజినెస్‌ను స్టార్ట్ చేసింది. ఇన్నేళ్లుగా దాని ఆన్లైన్ బిజినెస్ భారీ స్థాయిలో పెరుగుతూ వస్తోంది. ఈ ఏడాది మేలో అది స్టెడ్‌వ్యూ క్యాపిటల్ కంపెనీ నుంచి 100 కోట్ల రూపాయలను సేకరించింది.
అలాగే ఫ్యాషన్ స్టార్టప్ కంపెనీ అయిన స్టైల్ క్రాకర్లోనూ ఆలియా ఇన్వెస్ట్ చేసింది. మెదడుతో కాకుండా హృదయంతో ఆలోచించి 2017లో ఈ కంపెనీలో పెట్టుబడులు పెట్టానని ఆలియా చెప్పింది.
ఇవి కాకుండా, 2014లో అప్పటి ప్రముఖ ఇ-కామర్స్ వెబ్సైట్ జబాంగ్‌తో కలిసి ఒక క్లాతింగ్ లైన్ (వస్త్ర శ్రేణి)ని కూడా ప్రారంభించింది ఆలియా.
![]() |
![]() |