![]() |
![]() |

వాస్తవ పాత్రలు కల్పిత ఘట్టాలతో దర్శకధీరుడు యస్. యస్. రాజమౌళి రూపొందిస్తున్న పిరియడ్ డ్రామా 'ఆర్ ఆర్ ఆర్'. చరిత్ర పురుషులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ స్నేహం చుట్టూ అల్లుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో రామరాజుగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, భీమ్ గా యంగ్ టైగర్ యన్టీఆర్ నటిస్తున్నారు. చాన్నాళ్ళ తరువాత తెలుగునాట తెరకెక్కుతున్న ఈ సిసలైన మల్టిస్టారర్.. మల్టిలాంగ్వేజెస్ లో సందడి చేయనుంది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాని తొలుత 2020 జూలైలో విడుదల చేయాలనుకున్నారు. కొన్ని కారణాల వల్ల అది 2021 జనవరికి వాయిదా పడింది. కరోనా ఎఫెక్ట్ తో సంక్రాంతి సీజన్ ని కూడా ఆర్ ఆర్ ఆర్
మిస్సయింది. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. 2021 అక్టోబర్ నెలలో అంటే దసరా సీజన్ లో ఆర్ ఆర్ ఆర్ తెరపైకి వచ్చే అవకాశముందంటున్నారు. చూడాలి మరి.. అప్పటికైనా ఈ క్రేజీ మల్టిస్టారర్ ముస్తాబవుతుందో లేదంటే మరింత ఆలస్యమవుతుందో?
![]() |
![]() |