![]() |
![]() |

సినీ ప్రియుల ప్రశంసలు దక్కించుకున్న మలయాళ చిత్రం 'కప్పేలా' తెలుగులో రీమేక్ కానున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఈ సినిమాని నిర్మించనుంది.
ఓ నూతన దర్శకుడు తెరకెక్కించనున్న ఈ రొమాంటిక్ డ్రామాలో ఒరిజినల్ లో అన్నా బెన్ పోషించిన జెస్సీ పాత్రను 'ఉప్పెన' ఫేమ్ కృతి శెట్టి ధరించనుందని సమాచారం. ఇక శ్రీనాథ్ భాసి పోషించిన రాయ్ పాత్రలో విశ్వక్ సేన్ కనిపించనున్నారు. కాగా కథకు కీలకమైన మేక వన్నె పులి పాత్ర విష్ణు కోసం టాలెంటెడ్ యాక్టర్ నవీన్ చంద్రని ఎంపిక చేసిందట చిత్ర బృందం. ఒరిజినల్ వెర్షన్ లో ఈ క్యారెక్టర్ లో రోషన్ మాథ్యూ యాక్ట్ చేశాడు. త్వరలోనే ఈ రీమేక్ కి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశముంది.
మరి.. మలయాళీల మనసు దోచిన 'కప్పేలా'.. తెలుగులోనూ ప్రశంసాపూర్వకమైన విజయాన్ని అందుకుంటుందేమో చూడాలి.
![]() |
![]() |