![]() |
![]() |

ఇస్మార్ట్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఎంట్రీ మెగా కాంపౌండ్ సినిమాతోనే జరిగింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బద్రి కోసం పూరి తొలిసారి మెగాఫోన్ పట్టారు. కట్ చేస్తే.. మెగాస్టార్ చిరంజీవి వారసుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఎంట్రీ పూరి సినిమాతోనే జరిగింది. అలాగే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తోనూ పూరి చిత్రాలు చేశారు.
కాగా, చిరుత చిత్రం తరువాత మళ్ళీ జట్టుకట్టని చరణ్, పూరి.. త్వరలోనే ఓ మెగా ప్రాజెక్ట్ కోసం టీమ్ అప్ కానున్నారట. ఆర్ ఆర్ ఆర్ తరువాత చరణ్ కథానాయకుడిగా నటించే సినిమా ఇదే కావచ్చని టాక్. త్వరలోనే ఈ క్రేజీ వెంచర్ కి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశముంది.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. తన తొలి, మలి చిత్రాల దర్శకులతో చరణ్ బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్ చేయనుండడం. ద్వితీయ చిత్రం మగధీరని తెరకెక్కించిన దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో ఆర్ ఆర్ ఆర్ చేస్తున్న చెర్రీ.. ఆ నెక్స్ట్ మూవీని తన డెబ్యూ ఫిల్మ్ డైరెక్టర్ పూరి కాంబోలో చేయబోతున్నాడన్నమాట.
![]() |
![]() |