![]() |
![]() |
.jpg)
నమ్రతా శిరోద్కర్ షేర్ చేసిన సూపర్‌స్టార్ మహేశ్ లేటెస్ట్ పిక్చర్ ఇంటర్నెట్‌ను తుఫానులా ముంచెత్తింది. తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా నమ్రత షేర్ చేసిన ఆ పిక్చర్ మహేశ్ ఎయిర్‌పోర్ట్‌లో కూర్చొని ఉండగా తీసింది. తన భర్త లుక్స్ డ్రాప్ డెడ్ గార్జియస్‌గా కనిపిస్తోందని ఆమె అన్నారు.
"తెల్లవారుజామున 3 గంటలకు ఇలా ఎవరు కనిపిస్తారు? ఫ‌్లయిట్ కోసం ఎదురుచూస్తూ మీ ముందు ఒక డ్రాప్ డెడ్ గార్జియస్ మ్యాన్ కూర్చొని ఉంటే మీ టైమ్ ఎగురుతుంది'" అని రాసుకొచ్చారు నమ్రత.
ఆ పిక్చర్‌లో మహేశ్ మెరూన్ కలర్ హుడీ ధరించి ఉన్నాడు. కళ్లకు గాగుల్స్ ఉన్నాయి. క్లీన్ షేవ్‌తో కనిపిస్తోన్న ఆయనను చూస్తుంటే ప్రిన్స్ ఆఫ్ టాలీవుడ్ అని ఆయనను ఎందుకంటారో అర్థమవుతుంది. ట్విట్టర్‌లో ఈ పిక్చర్‌ను మహేశ్ ఫ్యాన్స్ వైరల్‌గా మార్చేశారు. దుబాయ్‌లో హాలిడేస్ పూర్తిచేసుకొని హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కోసం మహేశ్ ఫ్యామిలీ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చినప్పుడు తీసిన పిక్చర్ అది.
త్వరలోనే పరశురామ్ డైరెక్షన్‌లో 'సర్కారు వారి పాట' షూటింగ్ మొదలు పెట్టేందుకు సిద్ధమవుతున్నాడు మహేశ్. యు.ఎస్.లో షూటింగ్‌ను ప్లాన్ చేస్తున్నారు. ఈలోగా ఫ్యామిలీతో కొద్ది రోజులు దుబాయ్‌లో గడపడానికి వెళ్లాడు మహేశ్. అక్కడ వారికి నమ్రత అక్క శిల్పా శిరోద్కర్ కుటుంబం కూడా తోడయ్యింది.
కీర్తి సురేశ్ నాయికగా నటించే 'సర్కారు వారి పాట'లో అనిల్ కపూర్, విద్యా బాలన్ కూడా నటించనున్నారంటూ ప్రచారంలోకి వచ్చింది కానీ, ఇంతవరకూ అది ధ్రువపడలేదు.
![]() |
![]() |