![]() |
![]() |

తమిళ సినీ పరిశ్రమలో ఉన్న అగ్ర హీరోల్లో ధనుష్ కూడా ఒకడు. ఎన్నో విభిన్నమైన పాత్రలని పోషిస్తు స్వయంకృషితో ఆ స్థానానికి చేరుకున్నాడు. కొన్ని లక్షల మంది అభిమానులు ఆయన సొంతం. కొన్నాళ్ల క్రితం ధనుష్ మా కొడుకే అని మధురై కి చెందిన దంపతులు కోర్టులో కేసు వేశారు. ఇప్పడు ఆ కేసులో తీర్పు వచ్చింది.
కదిరేశన్, మీనాక్షి అనే జంట 2016 లో ధనుష్ మా కొడుకే అని మదురై కోర్టులో కేసు వేశారు.చిన్న వయసులోనే సినిమాల మీద పిచ్చితో ఇంట్లో నుంచి వెళ్లిపోయాడని ఎప్పటినుంచో వెతుక్కుంటూ వస్తే ఇప్పుడు దొరికాడని పిటిషన్ లో పేర్కొన్నారు. అలాగే మేము బతకడానికి నెలకి 65 వేల రూపాయిల డబ్బులు కూడా ఇవ్వాలని పిటిషన్ లో పొందుపరిచారు. కానీ ధనుష్ మాత్రం వాళ్ళు నా తల్లి తండ్రులు కాదని డబ్బులు రాబట్టేందుకే అలా డ్రామాలు ఆడుతున్నారని కోర్టుకి విన్నవించాడు. సుమారు తొమ్మిది సంవత్సరాల నుంచి ఈ కేసు నడుస్తు ఉంది.
తాజాగా కోర్టు ధనుష్ కి అనుకూలంగా తీర్పుని ఇచ్చింది. ధనుష్ ఎట్టి పరిస్థితుల్లోను కదిరేశన్ వాళ్ల కొడుకు కాదని ఖరాకండిగా చెప్పింది. ధనుష్ ఒంటి మీద పుట్టు మచ్చలు ఎక్కడెక్కడ ఉన్నాయో గతంలో కదిరేశన్ వాళ్ళు సమర్పించారు. దీంతో ఈ మధ్యనే రిజిస్టర్ సమక్షంలో ప్రభుత్వాసుపత్రి డీన్ చేత ధనుష్ ఒంటి మీద పుట్టుమచ్చలని చెక్ చేయించారు. వాళ్ళు చెప్పిన ప్లేస్ లో పుట్టుమచ్చలు లేవు. దీంతో కేసు కొట్టివేసింది. ఇప్పుడు ఈ తీర్పు ధనుష్ కి పెద్ద ఊరట నిస్తుందని చెప్పవచ్చు. ధనుష్ తండ్రి పేరు కస్తూరి రాజా ,తల్లి పేరు విజయలక్ష్మి. కస్తూరి రాజా తమిళంలో ఒకప్పుడు పేరు మోసిన గొప్ప దర్శకుడు. ధనుష్ అన్నయ్య సెల్వ రాఘవన్ కూడా బడా డైరెక్టర్. ప్రస్తుతం రాయన్ అనే మూవీతో ధనుష్ బిజీగా ఉన్నాడు.దర్శకత్వాన్ని కూడా తనే చేస్తున్నాడు.
![]() |
![]() |