![]() |
![]() |

రీసెంట్ గా బిగ్గెస్ట్ హిట్ కొట్టిన మలయాళ డబ్బింగ్ మూవీ ప్రేమలు. డైరెక్ట్ తెలుగు సినిమా రేంజ్ లో ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. రోజు రోజుకి కలెక్షన్స్ కూడా పెరుగుతున్నాయి.ఇటీవల జరిగిన మూవీ సక్సెస్ మీట్ లో దర్శక ధీరుడు రాజమౌళి కూడా టీం మీద ప్రశంసల వర్షం కురిపించాడు. తాజాగా ప్రేమలు కి సంబంధించిన అప్ డేట్ ఒకటి సినీ ప్రియులని ఆనందంలో ముంచెత్తుతుంది.
ప్రేమలు డిజిటల్ హక్కుల్ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో మార్చి 29 నుంచి సదరు ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.తెలుగుతో పాటు మలయాళం, కన్నడ, తమిళ ,హిందీ భాషల్లో కూడా రిలీజ్ కాబోతుందని అంటున్నారు. మార్చి ఫస్ట్ వీక్‌లోనే ఓటీటీలో రిలీజ్ చేయాలని డిస్నీ హాట్‌స్టార్ ప్లాన్ చేసింది.కాకపోతే తెలుగు వెర్షన్ మార్చి 8న థియేటర్ రిలీజ్ ఉండటంతో డిలే చేసింది.
హైదరాబాద్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ప్రేమలు లో నస్లీన్ కే,గఫుర్, మమిత బైజు లు సూపర్ గా చేసారు.ఆ ఇద్దరి నటనకి ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖుల నుంచి కూడా ప్రశంసలు లభిస్తున్నాయి.అఖిల బార్గవన్, థామస్, సంగీత్ ప్రతాప్, మీనాక్షి రవీంద్రన్ తదితరులు కీలక పాత్రలో నటించారు. రాజమౌళి కొడుకు కార్తికేయ తెలుగులో రిలీజ్ చేసాడు.గిరీష్ ఏ.డి దర్శకుడు
![]() |
![]() |