![]() |
![]() |
.webp)
ఎప్పుడొచ్చామని కాదు బుల్లెట్ దిగిందా లేదా.. ఇది మహేష్ బాబు ఫేమస్ డైలాగ్. ఇదే తరహాలో ఇప్పుడు ఒక హీరోయిన్ కూడా చెప్తుంది. సినిమాలో ఎంత సేపు ఉన్నామని కాదు ఎంత క్రేజ్ ని సంపాదించాము అని. కాకపోతే ఆ హీరోయిన్ తన నోటితో చెప్పలేదు. కానీ ప్రస్తుత పరిస్థితి మాత్రం అదే అని మనకి అర్ధం అవుతుంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు త్రిప్తి డిమ్రి
యానిమల్ ద్వారా రణబీర్ కపూర్, రష్మిక కి ఎంత పేరు వచ్చిందో త్రిప్తి డిమ్రి కి అంతే పేరు వచ్చింది.ఇంకా చెప్పాలంటే కొంచం ఎక్కువే అని చెప్పవచ్చు.తను కనపడింది కాసేపే అయినా కూడా తన అందంతో అందర్నీ కట్టిపడేసింది. తాజాగా ఈ అమ్మడు తన రెమ్యునరేషన్ ని పెంచిందనే వార్తలు వినిపిస్తున్నాయి. యానిమల్ కి 40 లక్షలు మాత్రమే తీసుకున్న ఆమె ఏకంగా కోటి రూపాయలు డిమాండ్ చేస్తుందని అంటున్నారు. ఆమె తాజాగా బుల్ బులయ్య 3 లో నటిస్తుంది.ఈ మూవీకే ఆమె కోటి రూపాయిలు అందుకోనుంది. పైగా అందులో ఆమెది గెస్ట్ రోల్.కానీ తన రెమ్యునరేషన్ విషయంలో మాత్రం తగ్గేది లేదని అంటుంది. ప్రస్తుతం ఈ విషయం బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది .
ఇక యానిమల్ లో రణబీర్ తో చేసిన రొమాన్స్ కి ఇండియా మొత్తం ఒక్కసారిగా షాక్ అయ్యింది. ఆ సమయంలో తన ఇంట్లో వాళ్ల దగ్గరనుంచి విమర్శలని కూడా ఎదుర్కొంది.సినిమా కోసమే అలా చేసానని ఆ సన్నివేశాలు తెరకెక్కించేటప్పుడు హీరో డైరెక్టర్ అండ్ కెమెరామెన్ లు మాత్రమే ఉన్నారని చెప్పింది.తెలుగులో కూడా ఆమెకి చాలా ఆఫర్స్ వస్తున్నాయి. ఇంకా ఏ మూవీకి కమిట్ అవ్వలేదు.
![]() |
![]() |