![]() |
![]() |
.webp)
నేను చెప్పినట్టు చెయ్యండి. నేను చెప్పినట్టు చేస్తే అనుకున్న టైంకి అన్ని చక్కగా అవుతాయి. ఇప్పుడు ఈ మాటలన్నీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటున్నాడు. ఎప్పుడు తన పని తాను చేసుకుంటు వెళ్లే ఎన్టీఆర్ (ntr)ఎందుకు అలా మాట్లాడుతున్నాడో చూద్దాం.
ఎన్టీఆర్ అప్ కమింగ్ మూవీ దేవర(devara)షూటింగ్ ప్రారంభం అయినప్పుడే ఏప్రిల్ 5 రిలీజ్ డేట్ అని ప్రకటించారు. కానీ అనుకోని కారణాల వాళ్ళ పోస్ట్ పోన్ అయ్యింది. కొన్ని రోజుల క్రితం అక్టోబర్ 10 వస్తామని అనౌన్స్ చేసారు. కానీ ఎన్టీఆర్ హడావిడీ చూస్తుంటే ఆ డేట్ కంటే ముందే వచ్చేలా ఉంది. సినిమాని త్వరగా కంప్లీట్ చెయ్యాలని కొరటాల అండ్ టీం కి ఎన్టీఆర్ స్ట్రిక్ట్ సూచనలు ఇస్తున్నాడనే టాక్ ఫిలిం సర్కిల్స్ లో చక్కెర్లు కొడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా జూలై, ఆగస్ట్ చివర నాటికీ సినిమా మొత్తం రెడీ అయిపోవాలనే హుకుం ని జారీచేశాడని అంటున్నారు.షూటింగ్ కూడా ఆల్ మోస్ట్ చివరి దశకి వచ్చేసింది.

దీంతో పవన్ (pawan kalyan) ఓజి (og)ఓల్డ్ డేట్ అయిన సెప్టెంబర్ 27 కి ఎన్టీఆర్ వస్తాడేమో అనే మాట వినిపిస్తుంది.ఎందుకంటే ఓ జి నెక్స్ట్ ఇయర్ కి వాయిదా పడింది.అక్టోబర్ లో తన ఫ్రెండ్ చరణ్ గేమ్ చేంజర్ వస్తుంది. దీంతో ఓజి ఓల్డ్ డేట్ కి దేవర పక్కా అని అంటున్నారు. పైగా సెప్టెంబర్ 27 కి గతంలో ఎన్టీఆర్ ఫస్ట్ బ్లాక్ బస్టర్ స్టూడెంట్ నెంబర్ వన్ వచ్చింది. ఈ మేరకు దేవర రిలీజ్ డేట్ మరికొన్ని రోజుల్లోనే రానుంది.ప్రస్తుతానికి దేవర ఫియర్ సాంగ్ ఫాన్స్ ని ఒక ఊపు ఊపుతుంది.
![]() |
![]() |