![]() |
![]() |
.webp)
హ్యాపీ డేస్ చిత్రం ద్వారా నటుడుగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి హీరోగా ఎదిగిన వ్యక్తి నిఖిల్(nikhil)కార్తికేయ 2 (karthikeya 2) తో పాన్ ఇండియా హీరోగా కూడా మారాడు. మొన్న జరిగిన ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ కూటమి గెలుపు కోసం ప్రచారం చేసాడు. అందుకు ఆయనకి అరుదైన గౌరవం లభించింది.
నేడు చంద్రబాబు నాయుడు (chandrababu naidu)నాలుగో సారి ముఖ్య మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి స్టేట్ గెస్ట్ గా హాజరవుతున్నాడు. గన్నవరం దగ్గరలోని కేసనపల్లి లో జరిగే ఈ కార్యక్రమానికి నిఖిల్ కూడా హాజరవుతున్నాడు. ఈ రోజు ఉదయమే హైదరాబాద్ నుండి బయలుదేరాడు. ఎంతో మంది మహామహులు పాల్గొంటున్న ఈ కార్యక్రమంలో నిఖిల్ పాల్గొనడం ఆయన అభిమానులకి ఆనందాన్ని ఇస్తుంది. కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన చీరాల ఎంఎల్ఏ కొండయ్య యాదవ్ నిఖిల్ కి మావయ్య అవుతారు.
సినిమాల పరంగా చూసుకుంటే ప్రస్తుతం స్వయంభు (swayambhu) అనే చారిత్రాత్మక మూవీ చేస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్లో నిర్మాణం జరుపుకుంటున్న ఈ మూవీపై నిఖిల్ అభిమానుల్లో ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. యుద్ధ వీరుడుగా ఇందులో చేస్తున్నాడు. సంయుక్త మీనన్ హీరోయిన్.
![]() |
![]() |