![]() |
![]() |

ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతోంది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు నటసింహం నందమూరి బాలకృష్ణ సాదర స్వాగతం పలికారు. వేదికపైకి చిరంజీవి రాగానే.. ఆప్యాయంగా పలకరించి షేక్ హ్యాండ్ ఇచ్చారు బాలయ్య. కాసేపు నవ్వుతూ ఇద్దరూ ముచ్చటించుకున్నారు. ఆ విజవల్ మెగా, నందమూరి అభిమానులకు కన్నులపండుగ మూమెంట్ అని చెప్పవచ్చు. కాగా ఈ కార్యక్రమంలో చంద్రబాబుతో పాటు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు.
![]() |
![]() |