![]() |
![]() |

ఈమధ్య కొన్ని సినిమాలు అధికారిక ప్రకటన రాకుండానే లాంచ్ అవుతున్నాయి. మరికొన్ని సినిమాలు సైలెంట్ గా షూటింగ్ కి కూడా వెళ్లిపోతున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఓ సినిమా విషయంలో ఇదే ట్రెండ్ ఫాలో అవుతోంది.
ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'డబుల్ ఇస్మార్ట్' సినిమా చేస్తున్న రామ్ పోతినేని.. తన తదుపరి చిత్రాన్ని 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' ఫేమ్ మహేష్ బాబు దర్శకత్వంలో చేయనున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ అయితే రాలేదు కానీ.. జూన్ 10న పూజా కార్యక్రమాలతో లాంచ్ చేశారట. ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగనుందని తెలుస్తోంది. మరి షూటింగ్ కి వెళ్లే ముందైనా అధికారికంగా ప్రకటిస్తారో లేదో చూడాలి.
![]() |
![]() |