![]() |
![]() |
.webp)
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు స్టార్ హీరోలు ఒకే వేదికపై కనిపిస్తే అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. ఇప్పుడు మెగా అభిమానులకు అలాంటి ఆనందమే కలగనుంది. ఒకే వేదికపై మెగా త్రయం సందడి చేయనుంది.
ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. దీంతో ఏపీ నూతన ముఖ్యమంత్రిగా బుధవారం(జూన్ 12) చంద్రబాబు (Chandrababu) ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి జనసేనాని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హాజరవుతారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనతో పాటు మెగా కుటుంబానికి చెందిన చిరంజీవి (Chiranjeevi), రామ్ చరణ్ (Ram Charan) కి కూడా ప్రత్యేక ఆహ్వానాలు అందాయి. ఆ ఇద్దరు కూడా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతున్నారు. అంటే ఒకే వేదికపై మెగా త్రయం చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ సందడి చేయనున్నారన్నమాట. ఈ ముగ్గురూ ఒకే వేదికపై కనిపిస్తే.. వారిని చూడటానికి మెగా అభిమానులకు రెండు కళ్ళు సరిపోవు అని చెప్పవచ్చు. మొత్తానికి బాబు ప్రమాణ స్వీకారోత్సవంలో మెగా త్రయం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది అనడంలో సందేహం లేదు.
![]() |
![]() |