![]() |
![]() |

ప్రభాస్(Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'కల్కి 2898 AD' (Kalki 2898 AD). భారతీయ పురాణాల ఆధారంగా రూపొందుతోన్న ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. జూన్ 27న విడుదల కానున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటాని తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అలాగే విజయ్ దేవరకొండ, నాని, దుల్కర్ సల్మాన్ కీలక పాత్రలలో మెరవనున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా విజయ్ పాత్రకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది.
'కల్కి' సినిమాలో అశ్వత్థామ సహా ఎన్నో పురాణ పాత్రలు కనిపించనున్నాయి. అశ్వత్థామ పాత్రలో అమితాబ్ బచ్చన్ కనువిందు చేయనున్నట్లు ఎప్పుడో క్లారిటీ వచ్చేసింది. అలాగే మహాభారతంలో గొప్ప యోధుడుగా పేరు తెచ్చుకున్న అర్జునుడి పాత్రలో విజయ్ దేవరకొండ కనిపించనున్నాడని ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే ఇదొక బిగ్ సర్ ప్రైజ్ అని చెప్పవచ్చు. అలాగే విజయ్ కెరీర్ లో ఈ పాత్ర స్పెషల్ గా నిలిచే అవకాశముంది.
దర్శకుడిగా నాగ్ అశ్విన్ కి ఇది మూడో సినిమా. ఆయన డైరెక్ట్ చేసిన మొదటి రెండు సినిమాలు 'ఎవడే సుబ్రహ్మణ్యం', 'మహానటి'లో విజయ్ కీలక పాత్రలు పోషించాడు. ఇప్పుడు 'కల్కి'లోనూ కీలకమైన అర్జునుడి పాత్ర పోషిస్తున్నాడనే వార్త ఆసక్తికరంగా మారింది.
![]() |
![]() |