![]() |
![]() |

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ మిస్టరీలో డ్రగ్స్ కోణాన్ని వెలికి తీయడానికి రంగంలోకి దిగిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) బృందానికి నేతృత్వం వహిస్తున్న డిప్యూటీ డైరెక్టర్ కెఎస్ మల్హోత్రా కరోనా బారిన పడ్డారు. ఎన్సీబీ అధికారులకు కరోనా వైరస్ సోకిన వార్త రావడం ఇది రెండోసారి. సెప్టెంబర్ 15, 16 తేదీలలో ఈ కేసు విచారణలో పాల్గొంటున్న అధికారికి కరోనా ఉందని నార్కోటిక్స్ కంట్రోల్ ధ్రువీకరించింది. ఇప్పుడు ఏకంగా డిప్యూటీ డైరెక్టర్ కరోనా బారిన పడ్డారు.

డ్రగ్స్ కేసులో సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ తదితరులను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అదే కేసులో దీపికా పదుకొనేకి సమన్లు జారీ చేశారు. ఆమెను ఆఫీసుకు పిలిపించి విచారించారు. దీపిక విచారణ సమయంలో కేపీఎస్ మల్హోత్రా విచారణ గదిలో ఉన్నారు. దురదృష్టవశాత్తు ఇప్పుడు ఆయనకు కరోనా వచ్చింది. హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్ శ్రద్ధ కపూర్ సారా అలీ ఖాన్ సైతం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇంకా వాళ్లకు క్లీన్ చిట్ లభించలేదు.
![]() |
![]() |