![]() |
![]() |

జనసేన అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను కన్నడ స్టార్ యాక్టర్ సుదీప్ మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం ఉదయం హైదరాబాద్ లోని పవన్ కల్యాణ్ కార్యాలయానికి సుదీప్ గారు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన పవన్ కల్యాణ్‌కు మొక్కలు బహూకరించారు. ఇద్దరూ సుమారు గంట సేపు వివిధ అంశాలపై మాట్లాడుకున్నారు.
కొవిడ్ అన్ లాక్ నేపథ్యంలో ఇటీవలే సినిమా చిత్రీకరణలు మొదలయ్యాయి. ఈ క్రమంలో తాను నటిస్తున్న చిత్రాల గురించి పవన్ కల్యాణ్‌కు సుదీప్ వివరించారు. కొవిడ్ ప్రోటోకాల్ నిబంధనలకు అనుగుణంగా షూటింగ్స్ చేయడంపై కూడా వారు మాట్లాడుకున్నారు. వర్తమాన, సామాజిక అంశాలపై ఆలోచనలను పంచుకున్నారు. ఆసక్తికర అంశం ఏమిటంటే... ఇద్దరి జన్మదినం సెప్టెంబర్ 2వ తేదీ కావడం.

![]() |
![]() |