![]() |
![]() |

విక్టరీ వెంకటేశ్ - దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావుది సూపర్ హిట్ కాంబినేషన్. వీరిద్దరి కలయికలో వచ్చిన జనరంజక చిత్రాల్లో `కూలీ నెం. 1` ఒకటి. ప్రముఖ బాలీవుడ్ నటి టబుకి తెలుగులో ఇదే మొదటి సినిమా కావడం విశేషం. పేదలంటే గిట్టని పెద్దింటి అమ్మాయి రంజిని (టబు)కి కూలీ అయిన రాజు (వెంకటేశ్) ఎలా గుణపాఠం చెప్పాడు? అసలు రంజిని గతమేంటి? అనే పాయింట్స్ చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. శారద, రావుగోపాలరావు, మోహన్ బాబు, కోట శ్రీనివాసరావు, పరుచూరి వెంకటేశ్వరరావు, బ్రహ్మానందం, బాబూ మోహన్, డబ్బింగ్ జానకి, నిర్మలమ్మ, రాళ్ళపల్లి, గౌతంరాజు, రజిత తదితరులు ఇందులో ఇతర ముఖ్య పాత్రల్లో అలరించారు.
మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా స్వరాలు సమకూర్చగా.. దిగ్గజ గీతరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యమందించారు. ``కొత్తగా కొత్తగా`` (బాలు, చిత్ర), ``కలయా నిజమా`` (ఇళయరాజా, పి.సుశీల), ``దండాలయ్యా`` (బాలు) చార్ట్ బస్టర్స్ గా నిలవగా.. ``కిల కిల`` (బాలు, చిత్ర), ``అటెన్షన్ ఎవ్రీబడి``(బాలు), ``అబ్బనీ``(బాలు, ఇళయరాజా) పాటలు కూడా అలరించేలా ఉంటాయి. సురేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై డి.సురేశ్ బాబు నిర్మించిన `కూలీ నెం.1`.. 1991 జూలై 12న విడుదలైంది. నేటితో ఈ మ్యూజికల్ హిట్ 30 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |