![]() |
![]() |

యువ సంగీత సంచలనం తమన్ కి సంక్రాంతి సీజన్ తో మంచి అనుబంధమే ఉంది. `మిరపకాయ్`తో మొదలుకుని `క్రాక్` వరకు తెలుగునాట ఇప్పటివరకు ఏడు సంక్రాంతి చిత్రాలతో సందడి చేశాడు. వీటిలో ఐదు సినిమాలు (మిరపకాయ్ (2011), బిజినెస్ మేన్(2012), నాయక్ (2013), అల వైకుంఠపురములో(2020), క్రాక్(2021)) విజయపథంలో పయనించగా.. రెండు చిత్రాలు (బాడీగార్డ్(2012), డిక్టేటర్ (2016)) యావరేజ్ గా నిలిచాయి. కట్ చేస్తే.. 2022లోనూ సంక్రాంతి సందడికి తమన్ సిద్ధమవుతున్నాడు.
ఆ వివరాల్లోకి వెళితే.. సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్ లో తమన్ చేస్తున్న `సర్కారు వారి పాట` 2022 సంక్రాంతికి రిలీజ్ కాబోతున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అంతేకాదు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తమన్ జట్టుకట్టిన `అయ్యప్పనుమ్ కోషియుమ్` రీమేక్ కూడా ముగ్గుల పండక్కే రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంటే.. 2022 సంక్రాంతికి తమన్ డబుల్ ధమాకా ఖాయమన్నమాట. అదే గనుక జరిగితే.. పదేళ్ళ తరువాత పొంగల్ బరిలో తమన్ డబుల్ ధమాకా ఇవ్వబోతున్నట్లే. 2012లో `బిజినెస్ మేన్`, `బాడీ గార్డ్` చిత్రాలతో పలకరించిన తమన్.. 2022లో `సర్కారు వారి పాట`, `అయ్యప్పనుమ్ కోషియుమ్` రీమేక్ తో ఆ ఫీట్ ని రిపీట్ చేయబోతున్నాడన్నమాట. మరి.. ఈ సారి రెండు చిత్రాలతోనూ సక్సెస్ అందుకుంటాడేమో చూడాలి.
![]() |
![]() |