![]() |
![]() |

తమిళనాడులోని కరూర్‌లో శనివారం కోలీవుడ్ స్టార్ హీరో, టీవీకే పార్టీ వ్యవస్థాపకుడు విజయ్ నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట కారణంగా 39 మంది ప్రాణాలు కోల్పోగా, 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా సినీ రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ ఘటనపై స్పందించారు. (TVK Vijay Rally Stampede)
చిరంజీవి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ "తమిళనాడులోని కరూర్‌లో జరిగిన ర్యాలీలో జరిగిన తొక్కిసలాట చాలా విషాదకరం. ఈ దుర్ఘటన నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఈ క్లిష్ట సమయంలో వారికి ధైర్యం చేకూరాలని కోరుకుంటున్నాను, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఓం శాంతి." అని పేర్కొన్నారు. (Chiranjeevi)

కాగా, కరూర్ కి విజయ్ ఆలస్యంగా చేరుకోవడం, రావాల్సిన దానికంటే ఎక్కువమంది ర్యాలీకి హాజరవ్వడం వంటి కారణాలతో తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై తమిళనాడు ప్రభుత్వం విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. విచారణ అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది.
![]() |
![]() |