![]() |
![]() |

ఓజి(OG)కి తెలంగాణ(Telangana)రాష్ట్ర ప్రభుత్వం టికెట్ల పెంపుకి పర్మిషన్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తు ప్రముఖ అడ్వకేట్ మల్లేష్ యాదవ్ హైకోర్టు లో పిటిషన్ వెయ్యడం తెలిసిన విషయమే.ఈ విషయంలో రీసెంట్ గా మల్లేష్ యాదవ్ మాట్లాడుతు తెలంగాణ హైకోర్ట్ ఇరవై ఐదవ తారీకు మధ్యాహ్నం నుంచే 'ఓజి' టికెట్ రేట్స్ తగ్గించాలని ఉత్తర్వులు జారీచేసింది. కానీ ఓజి ని నిర్మించిన డివివి ఎంటర్ టైన్ మెంట్స్ రేట్లు తగ్గించలేదు. ఈ విషయంలో పోరాడుతున్న నాపై సదరు సంస్థ వాళ్ళు సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేస్తు వస్తున్నారు. పైగా కోర్ట్ ఉత్తర్వులని పాటించకపోవడం రాజ్యాంగ ఉల్లంఘన అవుతుంది.
కాబట్టి నేను డివివి క్రియేషన్స్(DVV Creations)కి లీగల్ నోటీసు పంపించడమే కాకుండా క్రిమినల్ కేసు కూడా నమోదు చేయబోతున్నాను. కోర్టు జీవో వచ్చిన తర్వాత ఓజి ని ఎక్కువ డబ్బు పెట్టి చూసిన వాళ్ళు, తమ డబ్బు ఇవ్వమని కూడా డివివి సంస్థని అడగవచ్చు. మేము పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకం కాదు.టికెట్ ధరలు పెంచి అభిమానులతో పాటు ప్రేక్షకుల డబ్బులు దోచుకోవడానికే వ్యతిరేకమని మల్లేష్ యాదవ్ చెప్పుకొచ్చాడు.
![]() |
![]() |