![]() |
![]() |

రెండు తెలుగురాష్ట్రాల్లో 'ఓజి'(Og)కలెక్షన్స్ హంగామ కొనసాగుతుంది. తొలి రోజు 154 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టిన ఓజి రెండో రోజు 52 కోట్ల గ్రాస్ ని సాధించినట్టుగా వార్తలు వస్తున్నాయి. దీంతో రెండు రోజులకి వరల్డ్ వైడ్ గా 206 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసినట్లయింది. దీంతో పవన్(Pawan Kalyan)కెరీర్ లోనే హయ్యస్ట్ కలెక్షన్స్ సాధించే చిత్రంగా ఓజి దూసుకుపోతుంది. ఇక ఓవర్ సీస్ లో ప్రత్యంగిరా సినిమాస్ ద్వారా పవన్ కెరీర్ లోనే అత్యధిక థియేటర్స్ లో విడుదల కావడం జరిగింది.
రీసెంట్ గా సదరు సంస్థ సోషల్ మీడియా వేదికగా ఓజి ఓవర్సీస్ కలెక్షన్స్ ని ప్రకటించింది. రెండు రోజుల్లో ఓజి చిత్రం 4.2 మిలియన్ డాలర్స్ గ్రాస్ అందుకొని 5 మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరబోతోంది. ఎంటైర్ పవన్ కెరీర్ లోనే ఓవర్ సీస్ కి సంబంధించి హయ్యస్ట్ కలెక్షన్స్ ఇవే అని చెప్పవచ్చు. పవన్ తో పాటు ఇతర నటీనటుల మెస్మరైజ్ చేసే నటన, సుజిత్ దర్శకత్వ ప్రతిభ, టెక్నీవల్ వాల్యూస్ ఓవర్ సీస్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటుంది.

![]() |
![]() |