![]() |
![]() |
![]()
సినిమాటికెట్ రేట్ పెంపు విషయానికి సంబంధించి గత ప్రభుత్వంలో జరిగిన కొన్ని సంఘటనలపై చిరంజీవి(Chiranjeevi),బాలకృష్ణ(Balakrishna)మాటలు హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. కాకపోతే ఈ విషయంలో కొన్ని రాజకీయ దుష్టశక్తులు కలవడంతో,ఇష్యు పలురకాలుగా డైవర్ట్ అవుతుంది. ఇరువురు అభిమానులకి విషయం అర్ధమయ్యి సైలెంట్ గా ఉన్నారు. ఇక ఈ విషయంపై ఆర్ నారాయణ మూర్తి(R Narayanamurthy)రీసెంట్ గా తన అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది.
ఆయన మాట్లాడుతు అసెంబ్లీ లో కొంత మంది మాట్లాడిన మాటలకి చిరంజీవి ఇచ్చిన రిప్లై సరైనదే. చిరంజీవిగారు నాకు ఫోన్ చేసి ప్రభుత్వ పెద్దలతో సినిమా సమస్యలు గురించి మాట్లాడానికి రమ్మంటే వెళ్ళాను. అక్కడ ప్రభుత్వ పెద్దలతో సినిమా సమస్యల గురించి విన్నవించుకున్నాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu)గారు అధికారంలో ఉన్నారు.మా సినిమా సమస్యలని తీర్చాలి. పవన్ కళ్యాణ్(Pawan Kalyan)కూడా సినిమా రంగం నుంచే వెళ్లి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి. సినిమా సమస్యల గురించి పట్టించుకోవాలని చెప్పాడు. నారాయణమూర్తి రీసెంట్ గా యూనివర్సిటీ పేపర్ లీక్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
![]() |
![]() |