![]() |
![]() |

'అఖిల్ అక్కినేని'(AKhil Akkineni)కి సరైన సినిమా పడాలే కానీ, తెలుగు చిత్ర పరిశ్రమలో వన్ ఆఫ్ ది అగ్ర హీరోగా నిలబడటం ఖాయమనే మాటలు ఫ్యాన్స్ నుంచి వినపడుతుంటాయి. వారి మాటలకి తగ్గట్టే అఖిల్ గత చిత్రాల్లోని యాక్టింగ్, డాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ ఒక రేంజ్ లో ఉంటుంది. కథ, కథనాల వల్లే కొన్ని చిత్రాల రిజల్ట్ విషయంలో తేడా జరిగింది. దీంతో కట్ అవుట్ కి తగ్గ సినిమా పడితే 'అఖిల్' నెంబర్ వన్ హీరోల్లో ఒకడిగా ఉంటాడని ప్రేక్షకులు కూడా చెప్తుంటారు.
అఖిల్ ప్రస్తుతం 'లెనిన్'(Lenin)అనే క్రేజీ టైటిల్ తో మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటుంది. ఇప్పటికే ఎనభై శాతంకి పైగా షూటింగ్ ని జరుపుకోగా, చివరి షెడ్యూల్ ఈ నెల చివరలో ప్రారంభం కాబోతుంది. ఈ షెడ్యూల్ లో క్లైమాక్స్ సన్నివేశాలని చిత్రీకరించబోతున్నారు. దీంతో సినిమా కంప్లీట్ అవుతుంది. అక్టోబర్ చివరికల్లా మిగిలిన ప్యాచ్ వర్క్ మొత్తాన్ని పూర్తి చేసి, నవంబర్ 17 న థియేటర్స్ లో తీసుకురావాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ డేట్ పై త్వరలోనే అధికార ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది.
రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో పక్కా యాక్షన్ చిత్రంగా 'లెనిన్' తెరకెక్కుతుంది. అఖిల్ మాస్ అండ్ రగ్గడ్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్ తో అంచనాలు రెట్టింపు అయ్యాయి. అఖిల్ సరసన క్రేజ్ హీరోయిన్ 'భాగ్యశ్రీ బోర్సే'(bhagyashri Borse)జత కడుతుండటంతో, ఈ ఇద్దరి ఫెయిర్ సిల్వర్ స్క్రీన్ పై ఎలా సందడి చేయనుందనే ఆసక్తి కూడా అందరిలో ఉంది. నాగార్జున(Nagarjuna)తో కలిసి సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తుండగా మురళి కిషోర్(Murali Kishore)దర్శకుడు.

![]() |
![]() |