![]() |
![]() |

నటభూషణ శోభన్ బాబు కెరీర్ లో పలు మ్యూజికల్ హిట్స్ ఉన్నాయి. వాటిలో `కార్తీక పౌర్ణమి` ఒకటి. అగ్ర దర్శకుడు ఎ. కోదండరామిరెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రంలో శోభన్ బాబు కి జంటగా భాను ప్రియ, రాధిక నటించగా సత్యనారాయణ, సుత్తి వేలు, సుత్తి వీరభద్ర రావు, శైలజ, మమత, డబ్బింగ్ జానకి, పీజే శర్మ, మల్లికార్జున రావు, పట్టాభి, బేబి కామాక్షి ఇతర ముఖ్య పాత్రల్లో అలరించారు. పరుచూరి బ్రదర్స్ కథ - మాటలు అందించిన ఈ చిత్రానికి ఎ. కోదండరామి రెడ్డి స్క్రీన్ ప్లే సమకూర్చారు. నృత్య ప్రధాన కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో భానుప్రియ నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
వేటూరి సుందరరామ్మూర్తి కలం నుంచి జాలు వారిన గీతాలకు చక్రవర్తి బాణీలు కట్టారు. ``నటనలు చాలించరా``, ``నాగినిలా రస రాగిణిలా``, ``మనువాడిన మదన పంచమి``, ``నాయుడోరి చిన్నోడమ్మా``, ``తకటథిమి``, ``తలకు పోసుకువచ్చా``.. ఇలా ఇందులోని పాటలన్నీ ఆకట్టుకున్నాయి. శ్రీ కామాక్షి కమర్షియల్స్ పతాకంపై డి. శివప్రసాద్ రెడ్డి నిర్మించిన `కార్తిక పౌర్ణమి`.. 1987 ఏప్రిల్ 23న విడుదలై మహిళా ప్రేక్షకులను ఆకట్టుకుంది. నేటితో ఈ చిత్రం 35 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |