![]() |
![]() |

సంచలనం సృష్టించిన టీవీ నటి శ్రావణి ఆత్మహ్యత కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవరాజ్‌ను పోలీసులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. శ్రావణి పరిచయమైన దగ్గర్నుంచి, వారిద్దరి మధ్య బంధంపైనా, అనంతరం పరిణామాల పైనా ఆరా తీశారు. శ్రావణిని దేవరాజ్ వేధింపులకు గురిచేశాడని దేవరాజ్ కుటుంబ సభ్యులు ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే తన ఫ్యామిలీ మెంబర్సే తనను వేధిస్తున్నారని శ్రావణి తనతో అన్నట్లు పోలీసుల విచారణలో దేవరాజ్ చెప్పాడు.
తాజాగా తెరపైకి ఓ ఫిల్మ్ ప్రొడ్యూసర్ పేరు బయటకు వచ్చింది. శ్రావణి రెగ్యులర్‌గా ఆ ప్రొడ్యూసర్‌తో మాట్లాడుతూ ఉండేదనీ, ఆయన క్రెడిట్ కార్డ్‌ను సైతం ఉపయోగించేదని దేవరాజ్ పోలీసులకు వెల్లడించాడు. శ్రావణి తనతో క్లోజ్‌గా ఉంటుండంతో ఆ నిర్మాతతో కలిసి సాయికృష్ణారెడ్డి తనను బెదిరించాడని చెప్పాడు. దీనికి సంబంధించిన ఫోన్ కాల్ రికార్డుల్ని సైతం అతను పోలీసులకు అందజేశాడు. గూగుల్ పే, ఫోన్ పే ద్వారా క్యాష్ ట్రాన్‌శాక్షన్ విషయాన్ని పోలీసులు ఆరా తీశారు. అవి కేవలం డబ్బు ట్రాన్‌శాక్షన్స్ మాత్రమేననీ, తాను శ్రావణిని ఎప్పుడూ బెదిరించలేదనీ దేవరాజ్ చెప్పాడు. దీనికి సంబంధించిన కాల్ రికార్డుల్నీ, వాట్సాప్ ఆడియో క్లిప్స్‌ని కూడా అతను పోలీసులకు అందజేశాడు. ఫోన్ కాల్స్‌లో తనను ప్రేమిస్తున్నట్లు శ్రావణి చెప్పిన విషయం ఉందని కూడా అతను వెల్లడించాడు.

శ్రావణి, దేశరాజ్ కలిసి సెప్టెంబర్ 7న పంజాగుట్టలోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లిన సీసీ టీవీ ఫుటేజ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో దేవరాజ్‌తో శ్రావణి సన్నిహితంగా మెలగినట్లు వారు గుర్తించారు. అతడితో చనువుగా మెలగుతుండటంపై కుటుంబ సభ్యులు తనను వేధిస్తున్నట్లుగా శ్రావణి చెప్పినట్లు కాల్ సంభాషణల్లో ఉన్నట్లు తెలిసింది. సాయికృష్ణారెడ్డి చంపించడానికి ట్రై చేస్తున్నాడనీ, జాగ్రత్తగా ఉండమనీ దేవరాజ్‌ను శ్రావణి హెచ్చరిస్తున్న మాటలు కూడా అందులో ఉన్నాయి. అన్నవరంలో పెళ్లి చేసుకొని, ఎక్కడికైనా దూరంగా వెళ్లిపోయి ఉందామని శ్రావణి తనతో చెప్పినట్లు కూడా దేవరాజ్ పోలీసులకు వెల్లడించాడు.
దీంతో సాయికృష్ణారెడ్డితో పాటు సినీ నిర్మాత అశోక్‌రెడ్డిని విచారించడానికి పోలీసులు రెడీ అవుతున్నారు.

![]() |
![]() |