![]() |
![]() |

మన లక్ష్యం గొప్పదైతే సరిపోదు. ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి మన ప్రయత్నం కూడా అంతే గొప్పగా ఉండాలి. అప్పుడే విజయాన్ని సాధిస్తాం. దీనికి సరైన ఉదాహరణ కన్నడ హీరో, రాకింగ్ స్టార్ యశ్. ఒక సాధారణ బస్ డ్రైవర్ కొడుకైన యశ్.. నేడు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. చిన్నపాటి నుంచే సినీ హీరో కావాలని కలలు గన్న అతను.. దానికోసం ఏకంగా ఇంటినుంచి పారిపోయాడు. మొదట ఒక డ్రామా ట్రూప్ లో చేరి నాటకాలు ప్రదర్శించి, ఆ తర్వాత సీరియల్స్ లో నటిస్తూ సినిమా హీరోగా ఎదిగాడు.
ఒకట్రెండు సినిమాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేసిన యశ్.. 2008 లో వచ్చిన 'రాకీ' సినిమాతో సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఆ సినిమా ప్లాప్ అయింది. ఆ తర్వాతి రెండు సినిమాలు కూడా ప్లాప్ అయ్యాయి. కెరీర్ స్టార్టింగ్ లోనే హ్యాట్రిక్ ప్లాప్స్ ఎదురైనా యశ్ కృంగిపోలేదు. తనని తాను సానబెట్టుకుంటూ స్టార్ గా ఎదిగాడు. 'మొదల సాల' సినిమాతో మొదటి సోలో హిట్ అందుకున్న యశ్.. ఆ తర్వాత హిట్స్, సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్స్ అందుకుంటూ కన్నడలో తిరుగులేని ఇమేజ్ సంపాదించుకున్నాడు.
2018 లో వచ్చిన 'కేజీఎఫ్ చాప్టర్-1'తో యశ్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఆ సినిమాతో 'రాకీ భాయ్'గా నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. యశ్ స్క్రీన్ ప్రజెన్స్ కి, యాక్టింగ్ కి ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఇక తాజాగా వచ్చిన 'కేజీఎఫ్ చాప్టర్-2'తో యశ్ రేంజ్ ఎన్నో రెట్లు పెరిగిపోయింది. దేశవ్యాప్తంగా రాకీ భాయ్ అంటూ కేజీఎఫ్-2 మారుమోగిపోతోంది. ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారడమే కాకుండా.. ప్రస్తుతం ఇండియాలో ఉన్న బిగ్గెస్ట్ స్టార్స్ లో ఒకడిగా ఎదిగాడు. బస్ డ్రైవర్ కొడుకైన యశ్ ఇలా ఇండియాలోని బిగ్ స్టార్స్ లో ఒకడిగా ఎదగడం రియల్లీ గ్రేట్.
![]() |
![]() |