![]() |
![]() |

మార్చి 25 న ప్రపంచవ్యాప్తంగా 14 భాషలలో విడుదలైన 'ఆర్ఆర్ఆర్' 20 రోజుల్లో దాదాపు రూ.1050 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ కలెక్షన్స్ డ్రాప్ అవ్వడంతో పాటు 'కేజీఎఫ్-2' ప్రభంజనం మొదలవ్వడంతో ఫుల్ రన్ లో 1100 కోట్ల లోపు గ్రాస్ వసూలు చేసే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే 'ఆర్ఆర్ఆర్' రాబోయే రోజుల్లో మరికొన్ని భాషల్లో విడుదల కానుందని, ఈ సినిమా ఓవరాల్ గా 1500 కోట్లు రాబట్టినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.
ఆర్ఆర్ఆర్ మూవీని మరో 30 కి పైగా దేశాలలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని తాజాగా రామ్ చరణ్ తెలిపాడు. అక్టోబర్‌లో జపాన్‌లో విడుదలవుతుందని, అక్కడ ప్రమోషన్స్ లో కూడా తాము పాల్గొంటామని చెప్పాడు. అలాగే చైనాలో కూడా విడుదలయ్యే అవకాశముందని అన్నాడు. చరణ్ మాటలను బట్టి చూస్తే ఆర్ఆర్ఆర్ ప్రభంజనానికి ఇంకా ఫుల్ స్టాప్ పడలేదని తెలుస్తోంది.
ఇప్పటిదాకా అత్యధిక గ్రాస్ రాబట్టిన ఇండియన్ సినిమాలలో 'ఆర్ఆర్ఆర్' మూడో స్థానంలో నిలిచింది. 2000 కోట్లతో మొదటి స్థానంలో 'దంగల్', 1800 కోట్లతో రెండో స్థానంలో 'బాహుబలి-2' ఉన్నాయి. నిజానికి దంగల్ మొదటిసారి విడుదలైనప్పుడు 800 కోట్ల లోపు గ్రాస్ మాత్రమే రాబట్టింది. తర్వాత చైనాలో విడుదలై మరో 1200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. అలాగే మొదట 1700 కోట్లు వసూలు చేసిన బాహుబలి-2 కూడా తర్వాత చైనా, జపాన్, రష్యా వంటి దేశాల్లో విడుదలై మరో 100 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ కలెక్షన్స్ కూడా అలాగే పెరిగే అవకాశముంది.
జపాన్ లో తారక్ కి అంతో ఇంతో గుర్తింపు ఉంది. అక్కడ తారక్ సినిమాల్లోని సాంగ్స్ కి, డ్యాన్స్ లకు ఫ్యాన్స్ ఉన్నారు. 'నాటు నాటు' సాంగ్ లో తారక్, చరణ్ డ్యాన్స్ అదరగొట్టారు. ఈ ఒక్క సాంగ్ తోనే అక్కడి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే అవకాశముంది. పైగా అక్కడ ప్రమోషన్స్ లో తారక్, చరణ్ పాల్గొననున్నారు. దీంతో జపాన్ లో చెప్పుకోదగ్గ కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే 'బాహుబలి' క్రేజ్ తో చైనాతో పాటు మరికొన్ని దేశాల్లో మంచి కలెక్షన్స్ రాబట్టే అవకాశముంది. మొత్తంగా ఈ సినిమా మరో 300-400 కోట్లు కలెక్ట్ చేసి 1500 కోట్ల మార్క్ అందుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు.
![]() |
![]() |