![]() |
![]() |

ప్రస్తుతం ఇండియాలో ఉన్న టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో రాజమౌళి పేరు ముందు వరుసలో ఉంటుంది. 'బాహుబలి'తో టాలీవుడ్ మార్కెట్ ని ఊహించని స్థాయికి తీసుకెళ్లడమే కాకుండా.. ఇండియాలోని టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిపోయాడు. రాజమౌళితో సినిమా చేయాలని టాలీవుడ్ స్టార్స్ మాత్రమే కాదు.. బాలీవుడ్ స్టార్స్ కూడా పోటీ పడుతున్నారు. ఇక ఇటీవల 'ఆర్ఆర్ఆర్'తో వెయ్యి కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి సత్తాచాటాడు రాజమౌళి. అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్-3 ఇండియన్ మూవీస్ లో రెండు రాజమౌళి సినిమాలు ఉన్నాయంటేనే అర్థంచేసుకోవచ్చు ఆయన పవరేంటో. అయితే ఇప్పుడు రాజమౌళికి గట్టి పోటీ ఇవ్వబోతున్నాడు మరో సౌత్ డైరెక్టర్. ఆయనే ప్రశాంత్ నీల్.
కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇప్పటిదాకా చేసింది మూడు సినిమాలే.. కానీ ఆయన పేరు ఇప్పుడు నేషనల్ వైడ్ గా మారుమోగిపోతోంది. 'ఉగ్రం' సినిమాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన ప్రశాంత్ మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత కన్నడ హీరో యశ్ తో 'కేజీఎఫ్ చాప్టర్-1' తీసి సంచలనం సృష్టించాడు. అందులో హీరో ఎలివేషన్స్ కి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇతర భాషల ఆడియన్స్ కి తెలియని హీరోని పెట్టుకొని కూడా వారికి గూజ్ బంప్స్ తెప్పించొచ్చని ప్రశాంత్ రుజువు చేశాడు. ఇక ఇప్పుడు 'కేజీఎఫ్-2'తో అంతకుమించి గూజ్ బంప్స్ తెప్పిస్తున్నాడు. చాప్టర్-1 ని మించిన హీరో ఎలివేషన్స్ తో పాటు, మేకింగ్ పరంగా హాలీవుడ్ సినిమాలకు ధీటుగా తెరక్కించడంటూ ప్రశాంత్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. చాప్టర్-1 తో నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్.. ఇప్పుడు చాప్టర్-2 తో ఇండియాలోని టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిపోయాడు.
రాజమౌళి యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించడంతో పాటు ఎమోషనల్ సీన్స్ తీయడంలో దిట్ట. ఆయన తనదైన మేకింగ్ తో ఆడియన్స్ ని కట్టిపడేస్తాడు. ప్రశాంత్ స్టైల్ కూడా అంతే. కేజీఎఫ్ లో ఎలివేషన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో, మదర్ సెంటిమెంట్ కూడా అదేస్థాయిలో ఉంటుంది. రాజమౌళి లాగే ప్రశాంత్ కూడా డైరెక్టర్ గా ప్రతి సీన్ లో తన మార్క్ చూపిస్తున్నాడు. అయితే రాజమౌళి 10-12 సినిమాలకు తెచ్చుకున్న గుర్తింపుని.. ప్రశాంత్ 2-3 సినిమాలతోనే తెచ్చుకోవడం విశేషం. ప్రశాంత్ తో సినిమా చేయడానికి ప్రస్తుతం టాప్ స్టార్స్ పోటీ పడుతున్నారు. ఇప్పటికే ప్రభాస్ తో 'సలార్' మూవీ చేస్తున్న ప్రశాంత్.. ఆ తరువాత జూనియర్ ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయనున్నాడు. ఆ సినిమాలు కూడా హిట్ అయితే ప్రశాంత్ రేంజ్ మరింత పెరుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
![]() |
![]() |