![]() |
![]() |

ప్రస్తుతం తెలుగునాట హవా సాగిస్తున్న కథానాయికల్లో రష్మిక మందన్న, పూజా హెగ్డేని ప్రముఖంగా చెప్పుకోవాలి. ఒకవైపు స్టార్ హీరోలకి జోడీగా నటిస్తూనే.. మరోవైపు యువ కథానాయకులతోనూ ఆడిపాడుతూ ముందుకు సాగుతున్నారీ ముద్దుగుమ్మలు. అంతేకాదు.. పాన్ - ఇండియా ప్రాజెక్ట్స్ లోనూ మెరుస్తూ మురిపిస్తున్నారు.
ఇదిలా ఉంటే, వరుస విజయాలతో ముందుకు సాగుతున్న రష్మిక, పూజా హెగ్డే స్పీడ్ కి వారి వారి లేటెస్ట్ రిలీజెస్ బ్రేక్ వేశాయనే చెప్పాలి. ఆ వివరాల్లోకి వెళితే.. `సరిలేరు నీకెవ్వరు`, `భీష్మ`, `పుష్ప - ద రైజ్` చిత్రాలతో తెలుగునాట హ్యాట్రిక్ విజయాలు అందుకున్న రష్మిక.. రీసెంట్ గా `ఆడవాళ్ళు మీకు జోహార్లు`తో నేరుగా పలకరించగా సదరు చిత్రం బాక్సాఫీస్ ముంగిట బోల్తా పడింది. ఇక పూజ విషయానికి వస్తే.. `అరవింద సమేత వీర రాఘవ`, `మహర్షి`, `గద్దలకొండ గణేశ్`, `అల వైకుంఠపురములో`, `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` వంటి హిట్స్ తో ఫుల్ జోష్ లో ఉన్న తనకి `రాధే శ్యామ్` రూపంలో డిజాస్టర్ ఎదురైంది. తాజాగా వచ్చిన అనువాద చిత్రం `బీస్ట్` కూడా నెగటివ్ టాక్ నే మూటగట్టుకుంది. మరి.. రాబోయే చిత్రాలతోనైనా రష్మిక, పూజ మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వస్తారేమో చూడాలి.
![]() |
![]() |