![]() |
![]() |

ప్రస్తుతం ఎక్కడ చూసినా 'కేజీఎఫ్ చాప్టర్-2' ప్రభంజనమే కనిపిస్తోంది. నేడు విడుదలైన 'కేజీఎఫ్-2'కి చాప్టర్-1 కి మించిన రెస్పాన్స్ వస్తోంది. తెరపై రాకీ భాయ్ గా యశ్ ని చూపించిన తీరుకి గూజ్ బంప్స్ వస్తున్నాయి. ప్రస్తుతం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పేరు మారుమోగిపోతోంది. చాప్టర్-2 కి వస్తున్న పాజిటివ్ టాక్ చూసి ఫుల్ హ్యాపీగా కేజీఎఫ్ ఫ్యాన్స్ కి ప్రశాంత్ నీల్ సూపర్ గుడ్ న్యూస్ చెప్పాడు. 'కేజీఎఫ్ చాప్టర్-3' కూడా ఉందని హింట్ ఇచ్చి సర్ ప్రైజ్ చేశాడు.
కేజీఎఫ్ ను ముందు నుంచి రెండు పార్టులుగానే తీయాలి అనుకున్నారు. మూడో పార్ట్ ఉండదని గతంలో ప్రశాంత్ నీల్ కూడా చెప్పాడు. కానీ తాజాగా విడుదలైన చాప్టర్-2 ఎండ్ టైటిల్స్ లో చాప్టర్-3 ఉంటుందని హింట్ ఇచ్చి సర్ ప్రైజ్ చేశాడు. దీంతో ఫ్యాన్స్ తెగ సంతోషపడిపోతున్నారు. అప్పుడే చాప్టర్-3 స్టోరీ ఎలా ఉండబోతుందోనన్న చర్చలు మొదలయ్యాయి. చాప్టర్-3 స్టోరీ అమెరికా నేపథ్యంలో ఉండనుందని అంటున్నారు. చాప్టర్-1 లో చనిపోయాడని చెప్పిన అధీరా చాప్టర్-2 లో ప్రత్యక్షమైనట్లు.. రాకీ భాయ్ కూడా చాప్టర్-3 లో అమెరికాలో ప్రత్యక్షమవుతాడని ప్రచారం జరుగుతోంది. చాప్టర్-2 లో నేషనల్ డాన్ గా కనిపించిన రాకీ భాయ్.. చాప్టర్-3 లో ఇంటర్నేషనల్ డాన్ గా కనిపించనున్నాడని తెలుస్తోంది.
అయితే చాప్టర్-3 రావడానికి చాలా టైం పట్టే అవకాశముంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో 'సలార్' చేస్తున్నాడు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ప్రాజెక్ట్ తో బిజీ కానున్నాడు. అనంతరం రామ్ చరణ్ తో కూడా ఒక మూవీ ఉండొచ్చని అంటున్నారు. ఈ ప్రాజెక్ట్స్ పూర్తి చేసి కేజీఎఫ్-3 పట్టాలు ఎక్కించాలంటే చాలా టైం పట్టే అవకాశముంది.
![]() |
![]() |