![]() |
![]() |

మెగాస్టార్ చిరంజీవి ప్రీవియస్ మూవీ `సైరా.. నరసింహారెడ్డి` (2019)లో అతనికి జోడీగా నటించింది లేడీ సూపర్ స్టార్ నయన తార. అలాగే, ప్రస్తుతం సెట్స్ పై ఉన్న చిరు నెక్స్ట్ వెంచర్ `గాడ్ ఫాదర్`లోనూ ఓ ముఖ్య పాత్రలో దర్శనమివ్వనుంది నయన్. గమ్మత్తేమిటంటే.. ఈ రెండు సినిమాల నడుమ వస్తున్న మెగాస్టార్ `ఆచార్య`కి మాత్రం పోటీగా బరిలోకి దిగుతోంది ఈ టాలెంటెడ్ యాక్ట్రస్.
ఆ వివరాల్లోకి వెళితే.. తన ప్రియుడు విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో `నానుమ్ రౌడీదాన్` (2015) తరువాత నయనతార నటించిన తమిళ సినిమా `కాత్తు వాక్కుల రెండు కాదల్`. విజయ్ సేతుపతి హీరోగా నటించిన ఈ చిత్రంలో స్టార్ బ్యూటీ సమంత మరో నాయికగా ఎంటర్టైన్ చేయనుంది. ఏప్రిల్ 28న రిలీజ్ కానున్న ఈ ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా.. తెలుగులో `కణ్మణి రాంబో ఖతీజా` పేరుతో అదే రోజున అనువాదం కానుంది. మరోవైపు.. చిరు `ఆచార్య` కూడా అదే వారంలో అంటే ఏప్రిల్ 29న భారీ అంచనాల నడుమ తెరపైకి వస్తోంది. మరి.. ఏప్రిల్ చివరి వారంలో `చిరు వర్సెస్ నయన్` అన్నట్లుగా ఉన్న ఈ బాక్సాఫీస్ వార్ లో ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి.
![]() |
![]() |