![]() |
![]() |

ఇంట్రస్టింగ్ క్యారెక్టరైజేషన్‌తో మంచు విష్ణు ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకి కోన వెంకట్, చోటా కె. నాయుడు, అనూప్ రూబెన్స్ వంటి క్రేజీ టెక్నీషియన్స్ పనిచేయనుండటం ఇంట్రెస్ట్‌ను కలిగిస్తోంది. ఈషాన్ సూర్య డైరెక్ట్ చేసే ఈ మూవీ మోహన్ బాబు ఆశీస్సులతో అవ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతోంది. కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు ఈ చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించనున్నారు కోన వెంకట్.
డాషింగ్ సినిమాటోగ్రాఫర్ చో టా కె. నాయుడు వర్క్ చేస్తున్న ఈ మూవీకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ ఓ ఎస్సెట్ కానున్నది. జి.నాగేశ్వరరెడ్డి స్ర్కిఫ్ట్ అందించగా, నందు డైలాగ్స్ రాశారు.
ఇంకా టైటిల్ అనౌన్స్ చేయని ఈ సినిమాలో తను చేస్తున్న 'గాలి నాగేశ్వరరావు' క్యారెక్టర్ గెటప్‌ని ఒక స్కెచ్ రూపంలో తన ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేశారు మంచు విష్ణు. దాంతో పాటు, "Introducing my new character Gali Nageshwara Rao.. Exciting details coming soon.." అని ఆయన రాసుకొచ్చారు. ఇప్పటివరకూ చేయని పాత్రలో ఈ సినిమాలో ఆయన కనువిందు చేయనున్నట్లు డైరెక్టర్ తెలిపారు. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలను యూనిక్ ప్రమోషనల్ కార్యక్రమాల ద్వారా వెల్లడించడానికి ప్లాన్ చేస్తోంది చిత్ర బృందం.
![]() |
![]() |