![]() |
![]() |

రీసెంట్ బ్లాక్ బస్టర్ 'ఆర్ఆర్ఆర్'లో రామ్ చరణ్ ఇంట్రడక్షన్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. బ్రిటిష్ పోలీస్ అధికారి పాత్రలో నటించిన చరణ్.. ఓ వ్యక్తిని పట్టుకోవడం కోసం కేవలం చేతిలో ఓ లాఠీ పట్టుకొని రెండు వేల మంది మధ్యలోకి దూకి వారితో తలబడి ఆ వ్యక్తిని అరెస్ట్ చేస్తాడు. ఈ సన్నివేశాన్ని డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన విధానం సూపర్. వందల మంది దాడి చేసి గాయపరుస్తున్నా ఏ మాత్రం బెదరకుండా తన లక్ష్యాన్ని నెరవేర్చుకునే రామ్ పాత్రని అద్భుతంగా చూపించాడు. ఇప్పుడు ఇలాంటి ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ లో పవన్ కళ్యాణ్ నటించబోతున్నట్లు తెలుస్తోంది.
పవన్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ 'హరిహర వీరమల్లు'. పీరియడ్ డ్రామాగా రూపొందుతోన్న ఈ మూవీలో బందిపోటు దొంగ వీరమల్లుగా పవన్ నటిస్తున్నాడు. ఈ సినిమాలో భారీ యాక్షన్ సీక్వెన్స్ లు ఉంటాయట. ముఖ్యంగా వెయ్యి మందితో తీసే యాక్షన్ సీక్వెన్స్ సినిమాకే హైలైట్ కానుందని తెలుస్తోంది. ఇటీవల పవన్ స్టంట్ రిహార్సల్స్ చేస్తున్నట్లుగా విడుదల చేసిన ఫోటోలు ఈ సీక్వెన్స్ కి సంబంధించినవే అని అంటున్నారు. మొదటిసారి పీరియాడికల్ సినిమా చేస్తున్న పవన్ ఈ సినిమాతో ఎలాంటి సంచలనలో సృష్టిస్తాడో చూడాలి.

నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని మెగా సూర్యా ప్రొడక్షన్ బ్యానర్‌పై ఎ.ఎం. రత్నం నిర్మిస్తున్నారు. బాలీవుడ్ యాక్టర్లు అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫఖ్రి కీలక పాత్రలు పోషిస్తోన్న ఈ మూవీకి ఎం.ఎం. కీరవాణి సంగీతం, జ్ఞానశేఖర్ ఛాయాగ్రహణం సమకూరుస్తున్నారు.
![]() |
![]() |