![]() |
![]() |

నటసింహం నందమూరి బాలకృష్ణ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం `అఖండ`. మాస్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో `సింహా`, `లెజెండ్` వంటి సెన్సేషనల్ హిట్స్ తరువాత బాలయ్య చేసిన చిత్రం కావడంతో.. అటు అభిమానుల్లోనూ, ఇటు సగటు ప్రేక్షకుల్లోనూ, అలాగే ట్రేడ్ వర్గాల్లోనూ `అఖండ`పై ఎనలేని ఆసక్తి నెలకొని ఉంది. కాగా, భారీ అంచనాల నడుమ ఈ క్రేజీ ప్రాజెక్ట్.. డిసెంబర్ 2న థియేటర్స్ లో సందడి చేయనుంది.
ఇదిలా ఉంటే.. తాజాగా `అఖండ` రన్ టైమ్ కి సంబంధించి ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే.. 157 నిమిషాలు ( 2 గంటల 37 నిమిషాలు) నిడివితో ఈ యాక్షన్ డ్రామా సాగుతుందట. అంతేకాదు.. దాదాపు 40 నిమిషాల పాటు పోరాట ఘట్టాలు ఉంటాయని బజ్. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. `సింహా`, `లెజెండ్` కూడా ఇంచుమించుగా ఇంతే డ్యూరేషన్ తో తెరకెక్కాయి. మరి.. సెంటిమెంట్ రిపీట్ అయి `అఖండ` కూడా బాక్సాఫీస్ ముంగిట అఖండ విజయం సాధిస్తుందేమో చూడాలి.
బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన `అఖండ`లో ప్రగ్యా జైశ్వాల్ నాయికగా నటించగా శ్రీకాంత్, జగపతి బాబు ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఈ చిత్రానికి స్వరకర్త.
![]() |
![]() |