![]() |
![]() |

అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'ఏజెంట్'. అయితే సురేందర్ రెడ్డి కరోనా బారిన పడటంతో.. శరవేగంగా సాగుతున్న ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ పడింది.
'ఏజెంట్' సినిమా షూటింగ్ కోసం హంగేరి వెళ్లి వచ్చిన సురేందర్ రెడ్డి కరోనా బారిన పడ్డారు. సురేందర్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులకు కూడా కరోనా పాజిటివ్‌గా తేలినట్లు సమాచారం. ప్రస్తుతం వీరంతా క్వారంటైన్ లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. సురేందర్ రెడ్డికి కరోనా అని తేలడంతో 'ఏజెంట్' షూటింగ్ కి బ్రేక్ పడింది. ఆయన పూర్తిగా కోలుకున్నాకే పెండింగ్‌లో ఉన్న షూటింగ్‌ను పూర్తిచేయనున్నట్లు 'ఏజెంట్' మూవీ టీమ్ తెలిపింది.
ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ సినిమా బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తోంది. వక్కంతం వంశీ కథ అందించిన ఈ సినిమాకి హిప్ హాప్ తమీజా సంగీతం అందిస్తున్నారు.
![]() |
![]() |