![]() |
![]() |

నేచురల్ స్టార్ నాని నటించిన `గ్యాంగ్ లీడర్`తో తెలుగునాట కథానాయికగా తొలి అడుగేసిన ప్రియాంక అరుళ్ మోహన్.. ఆపై శర్వానంద్ `శ్రీకారం`తో సందడి చేసింది. ఈ రెండు సినిమాలు కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. ఈ నేపథ్యంలో.. కోలీవుడ్ బాట పట్టిన ప్రియాంకకి `డాక్టర్` రూపంలో తొలి విజయం దక్కింది. తెలుగులో `వరుణ్ డాక్టర్` పేరుతో అనువాదమైన సదరు చిత్రం.. ఇక్కడి వారిని కూడా ఎంటర్టైన్ చేసింది. కట్ చేస్తే.. ప్రస్తుతం ప్రియాంక ఖాతాలో రెండు తమిళ సినిమాలున్నాయి.
ఆ చిత్రాలే.. `ఎదర్కుమ్ తుణిందవన్`, `డాన్`. వీటిలో `ఎదర్కుమ్ తుణిందవన్` కోసం స్టార్ హీరో సూర్యతో జతకట్టిన ప్రియాంక.. `డాన్` కోసం యూత్ స్టార్ శివ కార్తికేయన్ తో `డాక్టర్` అనంతరం మరోసారి జోడీకట్టింది. ఈ రెండు చిత్రాలు కూడా తక్కువ గ్యాప్ లోనే తెరపైకి రాబోతున్నాయి. `ఎదుర్కుమ్ తుణిందవన్` వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న తెరపైకి రానుండగా.. `డాన్` ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. మరి.. ఈ రెండు చిత్రాలతో ప్రియాంక అరుళ్ మోహన్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సొంతం చేసుకుని.. కోలీవుడ్ లో హ్యాట్రిక్ హీరోయిన్ అనిపించుకుంటుందేమో చూడాలి.
![]() |
![]() |