![]() |
![]() |

మెగా కాంపౌండ్ నుంచి ఎంటర్టైన్ చేస్తున్న యువ కథానాయకుల్లో వరుణ్ తేజ్ ఒకరు. వైవిధ్యానికి పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతున్న ఈ యంగ్ హీరో.. అనతికాలంలోనే నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. `ఫిదా`, `తొలిప్రేమ`, `ఎఫ్ 2`, `గద్దలకొండ గణేశ్` వంటి విజయాలతో సక్సెస్ ఫుల్ హీరో అనిపించుకున్నాడు. కాగా, త్వరలో ఈ యంగ్ హీరో `గని`గా పలకరించబోతున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన ఈ క్రేజీ ప్రాజెక్ట్.. డిసెంబర్ 24న తెరపైకి రానుంది.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. ఈ సినిమా రిలీజ్ కి వారం ముందు అదే మెగా క్యాంప్ కి చెందిన అల్లు అర్జున్ `పుష్ప - ద రైజ్`తో సందడి చేయనున్నాడు. డిసెంబర్ 17న ఈ పాన్ - ఇండియా ప్రాజెక్ట్ థియేటర్స్ లోకి రానుంది. గతంలోనూ వరుణ్ తేజ్ కి సేమ్ కాంపౌండ్ నుంచి పోటీ ఎదురైంది. 2018 ఫిబ్రవరిలో సాయితేజ్ నటించిన `ఇంటిలిజెంట్`, వరుణ్ నటించిన `తొలిప్రేమ` కేవలం ఒక్క రోజు వ్యవధిలో విడుదల కాగా.. 2019 సంక్రాంతికి రామ్ చరణ్ నటించిన `వినయ విధేయ రామ`, వరుణ్ నటించిన `ఎఫ్ 2`కూడా అదే తరహాలో కేవలం ఒక్క రోజు తేడాతో రిలీజయ్యాయి. ఈ రెండు సందర్భాల్లోనూ వరుణ్ కే విజయాలు దక్కాయి. మరి.. బన్నీతో వారం గ్యాప్ లో పోటీపడుతున్న వరుణ్ కి .. ఈ సారి ఎలాంటి ఫలితం దక్కుతుందో చూడాలి.
![]() |
![]() |