![]() |
![]() |

అక్కినేని నాగార్జున హీరోగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'బంగార్రాజు'. ఈ మూవీలో అక్కినేని యువ హీరో నాగ చైతన్య కూడా నటిస్తుండగా.. ఆయనకు జోడీగా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి నటిస్తోంది. ఇటీవల విడుదలైన కృతి శెట్టి పోషిస్తున్న 'నాగలక్ష్మి' పాత్రకి సంబంధించిన లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక త్వరలో 'బంగార్రాజు' కూడా ప్రేక్షకులను పలకరించబోతున్నాడు.
'బంగార్రాజు' ఫస్ట్ లుక్, టీజర్ కు సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ తాజాగా మేకర్స్ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. 'బంగార్రాజు' ఫస్ట్ లుక్ ని ఈ నెల 22వ తేదీన సాయంత్రం 5:22 కి విడుదల చేయనున్నారు. ఈ సినిమా టీజర్ ను నాగ చైతన్య పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 23వ తేదీన ఉదయం 10:23కి విడుదల చేయనున్నారు. తాజాగా వచ్చిన 'బంగార్రాజు' అప్డేట్ తో అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

నాగార్జున- కల్యాణ్ కృష్ణ కాంబినేషన్ లో వచ్చిన 'సోగ్గాడే చిన్ని నాయనా(2016)' సినిమా ఘన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో 'బంగార్రాజు' పాత్రలో నాగార్జున అలరించాడు. ఇప్పుడిదే టైటిల్ తో 'సోగ్గాడే చిన్ని నాయనా' ప్రీక్వెల్ గా 'బంగార్రాజు' రానుంది. 'బంగార్రాజు'గా నాగార్జున సిల్వర్ స్క్రీన్ పై మరోసారి మ్యాజిక్ చేస్తాడేమో చూడాలి.
![]() |
![]() |