![]() |
![]() |

`నిన్ను కోరి` చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన శివ నిర్వాణ.. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆపై `మజిలీ`తో మెమరబుల్ హిట్ ని కొట్టిన శివ.. మూడో చిత్రం `టక్ జగదీష్`తో మాత్రం నిరాశపరిచాడు. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అయిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్.. మిశ్రమ స్పందన పొందింది. ఈ నేపథ్యంలో.. శివ నిర్వాణ తదుపరి చిత్రంపై ఎనలేని ఆసక్తి నెలకొని ఉంది. యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండతో తన నాలుగో సినిమా రూపొందనుందని ఇప్పటికే చెప్పుకొచ్చాడు శివ నిర్వాణ.
లేటెస్ట్ బజ్ ఏంటంటే.. విజయ్ దేవరకొండ - శివ నిర్వాణ కాంబినేషన్ మూవీ 2022 జనవరిలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం కానుందట. ఆపై ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ బాట పడుతుందని ఇన్ సైడ్ టాక్. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
కాగా, ప్రస్తుతం పాన్ - ఇండియా ప్రాజెక్ట్ `లైగర్`తో బిజీగా ఉన్నాడు విజయ్ దేవరకొండ. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్ మూవీని.. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్నాడు. 2022లో ఈ సినిమా తెరపైకి రానుంది.
![]() |
![]() |