![]() |
![]() |

ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యధిక ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన సినిమాగా 'ఆర్ఆర్ఆర్' రికార్డు క్రియేట్ చేసింది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మార్చి 25 న విడుదల కానుంది. ఈ సినిమాలు విడుదలకు ముందే బిజినెస్ పరంగా, అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా సంచలనాలు సృష్టిస్తోంది. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ.451 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ తో సత్తా చాటింది.
తెలుగు రాష్ట్రాలలో ఆర్ఆర్ఆర్ 211 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ ఎప్పుడో జరగగా.. సినిమా ఆలస్యం మరియు పాండెమిక్ తెచ్చిన నష్టాలు కారణంగా డిస్ట్రిబ్యూటర్స్ కోరిక మేరకు మేకర్స్ 10 శాతం తగ్గించినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలలో ఆర్ఆర్ఆర్ 191 కోట్లు బిజినెస్ చేసింది. నైజాం(తెలంగాణ)లోనే ఈ సినిమా 70 కోట్ల బిజినెస్ చేసింది. నైజాంలో ఇప్పటిదాకా హైయెస్ట్ షేర్ కలెక్ట్ చేసిన మూవీ రాజమౌళి డైరెక్ట్ చేసిన 'బాహుబలి-2'నే కావడం విశేషం. ఈ మూవీ నైజాంలో ఫైనల్ గా 68 కోట్ల షేర్ రాబట్టగా.. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ మూవీ బిజినెస్సే 70 కోట్లు చేయడం హాట్ టాపిక్ గా మారింది.
ఇక ఆంధ్రప్రదేశ్ లో ఆర్ఆర్ఆర్ మూవీ 121 కోట్ల బిజినెస్ చేసినట్లు సమాచారం. సీడెడ్ లో 37 కోట్లు, ఆంధ్రాలో 84 కోట్లు(ఉత్తరాంధ్ర 22 కోట్లు, ఈస్ట్ గోదావరి 14 కోట్లు, వెస్ట్ 12 కోట్లు, గుంటూరు 15 కోట్లు, కృష్ణ 13 కోట్లు, నెల్లూరు 8 కోట్లు) బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఏపీ, తెలంగాణలో కలిసి ఆర్ఆర్ఆర్ 191 కోట్ల బిజినెస్ చేసింది.
హిందీ వెర్షన్ 92 కోట్ల బిజినెస్ ఆర్ఆర్ఆర్.. ఓవర్సీస్ లో 75 కోట్లతో సత్తా చాటింది. అలాగే కర్ణాటకలో 41 కోట్లు, తమిళనాడు 35 కోట్లు, కేరళ 9 కోట్లు, రెస్టాఫ్ ఇండియా 8 కోట్లు.. ఇలా అన్ని చోట్లా భారీస్థాయిలో ఆర్ఆర్ఆర్ బిజినెస్ చేసింది. 452 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగుతున్న ఆర్ఆర్ఆర్ మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల షేర్ రాబట్టే అవకాశముందని అంటున్నారు.
![]() |
![]() |