![]() |
![]() |

కరోనా సెకండ్ వేవ్ కారణంగా థియేటర్లు మూతపడిన సంగతి తెలిసిందే. దీంతో పలు సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీలో విడుదలవుతున్నాయి. కొందరు మేకర్స్ మాత్రం థియేటర్లలోనే తమ సినిమాలను విడుదల చేయాలని ఎదురుచూస్తున్నారు. అయితే థియేటర్లు తెరిచినా.. ప్రేక్షకులు మునుపటిలా సినిమా చూసేందుకు వస్తారా లేదా అనేది అనుమానంగానే ఉంది. ప్రేక్షకులు థియేటర్ల బాట పట్టడానికి కొంత సమయం పట్టే అవకాశముందని అంటున్నారు. దీంతో మంచి ఆఫర్ వస్తే డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు.
వెంకటేష్ నటించిన 'నారప్ప' సినిమాను నేరుగా ఓటీటీలో విడుదల చేసేందుకు నిర్మాతలు సిద్ధమయ్యారు. 'నారప్ప' సినిమాను మొదట థియేటర్లలోనే విడుదల చేయాలని నిర్మాతలు భావించినా.. ప్రస్తుత పరిస్థితులు నేపథ్యంలో ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయించారు. 'నారప్ప'ను ఓటిటిలో విడుదల చేయడానికి ఇప్పటికే పాపులర్ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ తో భారీ డీల్ కుదుర్చుకున్నారట. జులై 24న అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో నేరుగా సినిమాను విడుదల చేయనున్నారు.
తమిళంలో ధనుష్ హీరోగా తెరకెక్కి ఘన విజయం సాధించిన 'అసురన్' మూవీకి రీమేక్ గా 'నారప్ప' రూపొందింది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వెంకటేష్ భార్యగా ప్రియమణి నటించింది. ఇక వెంకటేష్ నటిస్తున్న మరో మూవీ 'దృశ్యం 2' కూడా డైరెక్ట్ ఓటీటీలోనే విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.
![]() |
![]() |