![]() |
![]() |

కథానాయికగా కంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే తెలుగువారికి దగ్గరయ్యింది సీనియర్ హీరోయిన్ నదియా. `మిర్చి`, `అత్తారింటికి దారేది` చిత్రాలతో గుణచిత్ర నటిగా స్టార్ డమ్ చూసిందీ ఈ టాలెంటెడ్ యాక్ట్రస్. ప్రస్తుతం నదియా చేతిలో `దృశ్యం 2`, `గని`, `వరుడు కావలెను` వంటి తెలుగు చిత్రాలు ఉన్నాయి. వీటిలో మాలీవుడ్ ఓటీటీ సెన్సేషన్ `దృశ్యం 2`కి రీమేక్ వెర్షన్ అయిన `దృశ్యం 2` విడుదలకు సిద్ధంగా ఉంది.
ఇదిలా ఉంటే.. నదియా చెంతకి మరో క్రేజీ ప్రాజెక్ట్ చేరిందని టాక్. ఆ వివరాల్లోకి వెళితే.. `దృశ్యం 2`ని తమిళంలో లోకనాయకుడు కమల్ హాసన్ తో రీమేక్ చేయబోతున్న సంగతి తెలిసిందే. `దృశ్యం` సిరీస్ లో మొదటి చిత్రమైన `దృశ్యం` తాలూకు తమిళ వెర్షన్ `పాపనాశం`లో కమల్ కి జోడీగా గౌతమి నటించింది. అయితే, ప్రస్తుతం కమల్, గౌతమి మధ్య సత్సంబంధాలు లేని కారణంగా ఆ పాత్రలో మీనా నటించబోతున్నట్లు ప్రచారం సాగింది. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ఈ పాత్రలో నదియాని నటింపజేసే ప్రయత్నాలు చేస్తున్నారట దర్శకుడు జీతూ జోసెఫ్. అదే గనుక నిజమైతే.. కమల్ కి జంటగా నదియా నటించే మొదటి సినిమా ఇదే అవుతుంది.
ఏదేమైనా.. `దృశ్యం` తెలుగు వెర్షన్ రెండు భాగాల్లోనూ పోలీస్ అధికారి పాత్రలో నటించిన నదియా.. ఇప్పుడు మెయిన్ లీడ్ కి ప్రమోట్ అవడం విశేషమనే చెప్పాలి. త్వరలోనే `పాపనాశం 2`లో నదియా ఎంట్రీపై క్లారిటీ వచ్చే అవకాశముంది.
![]() |
![]() |