![]() |
![]() |

సినీనటుడు, క్రిటిక్ కత్తి మహేష్ రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు.. లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన తలకు బలమైన గాయాలు కాగా.. వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. కత్తి మహేష్ ఎడమ కంటి చూపు కోల్పోయినట్టు తెలుస్తోంది.
రెండు రోజుల క్రితం విజయవాడ నుంచి చిత్తూరుకు కారులో వెళుతున్న కత్తి మహేష్ నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో కత్తి మహేష్ తల, ముక్కు, కళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయన్ను నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం శనివారం రాత్రి ఆయన్ను చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు.
ప్రమాదంలో దెబ్బతిన్న కత్తి మహేష్ కళ్లకు సోమవారం ఆపరేషన్ చేయనున్నారు. అయితే ఎడమ కంటి చూపు పూర్తిగా పోయినట్టు వైద్యులు తమకు చెప్పారని కత్తి మహేష్ మేనమామ ఎం.శ్రీరాములు మీడియాకు తెలిపారు. అయితే ప్రమాదం వల్ల మెదడులో ఎలాంటి రక్తస్రావం జరగలేదని, అందువల్ల మహేష్ కు ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పారని తెలిపారు.
![]() |
![]() |