![]() |
![]() |

స్టార్ హీరోల సినిమాలకు ప్రీరిలీజ్ బిజినెస్ ఏ స్థాయిలో జరుగుతుందో.. రిజల్ట్ తేడా కొడితే నష్టాలు కూడా అదే స్థాయిలో వస్తాయి. టాలీవుడ్ చరిత్రలో అత్యధిక నష్టాలను మూటగట్టుకున్న సినిమాల లిస్ట్ లో మొదటి మూడు స్థానాల్లో 'రాధేశ్యామ్', 'అజ్ఞాతవాసి', 'స్పైడర్' సినిమాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ టాప్-3 డిజాస్టర్ మూవీస్ లిస్టులో 'ఆచార్య' చేరే అవకాశముంది.
ఈ ఏడాది మార్చిలో విడుదలైన 'రాధేశ్యామ్' టాలీవుడ్ చరిత్రలో అత్యధిక నష్టాలను సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది. వరల్డ్ వైడ్ గా రూ.202.80 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ ఈ మూవీ.. ట్రేడ్ వర్గాల ప్రకారం ఫుల్ రన్ లో 83.20 కోట్ల షేర్ మాత్రమే రాబట్టి బయ్యర్లకు 120 కోట్లకు పైగా నష్టాలను మిగిల్చింది. ఆ తర్వాతి స్థానాల్లో 66 కోట్ల లాస్ తో 'అజ్ఞాతవాసి', 60 కోట్ల లాస్ తో 'స్పైడర్' సినిమాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు 'అజ్ఞాతవాసి' రికార్డుని బ్రేక్ చేసి అత్యధిక నష్టాలను మూటగట్టుకున్న సినిమాల లిస్ట్ లో 'ఆచార్య' రెండో స్థానంలో నిలిచే ఛాన్స్ ఉంది.
కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా 'ఆచార్య'. ఏప్రిల్ 29 న విడుదలైన ఈ సినిమా మొదటి షో నుంచే నెగటివ్ టాక్ తెచ్చుకొని దారుణమైన కలెక్షన్స్ రాబడుతోంది. వరల్డ్ వైడ్ గా 131.20 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన ఆచార్య.. మూడు రోజుల్లో 45.52 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కి ఇంకా 86 కోట్ల దూరంలో ఉంది. తెలుగు రాష్ట్రాల్లో 107.50 కోట్ల బిజినెస్ చేసిన ఆచార్య మూడు రోజుల్లో కేవలం 38.72 కోట్ల షేర్ రాబట్టింది. మొదటి వీకెండ్ లోనే మంచి ఓపెనింగ్స్ రాబట్టలేకపోయిన ఈ సినిమా.. వీక్ డేస్ లో ఏ మాత్రం ప్రభావం చూపే అవకాశం లేదు. దీంతో ఫుల్ రన్ లో తెలుగు రాష్ట్రాల్లోనే 60 కోట్ల నష్టాలను చూసే అవకాశమున్న ఆచార్య.. వరల్డ్ వైడ్ గా 70 కోట్ల నష్టాలను సొంత చేసుకునే అవకాశముందని అంటున్నారు.
![]() |
![]() |