![]() |
![]() |

`క్షణం`(2016), `అమీ తుమీ` (2017), `గూఢచారి` (2018), `ఎవరు` (2019) చిత్రాలతో కథానాయకుడిగా నాలుగు వరుస విజయాలను అందుకున్నాడు మల్టిటాలెంటెడ్ అడివి శేష్. ఈ నేపథ్యంలో.. అతని తదుపరి సినిమాలపై ప్రేక్షకుల్లో, పరిశ్రమ వర్గాల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొని ఉంది.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. జూన్, జూలై ఇలా రెండు వరుస నెలల్లో తన కొత్త చిత్రాలతో పలకరించబోతున్నాడు అడివి శేష్. ఆ వివరాల్లోకి వెళితే.. మేజర్ సందీప్ ఉన్నిక్రిష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోగ్రాఫికల్ యాక్షన్ ఫిల్మ్ `మేజర్` జూన్ 3న పలు భాషల్లో సందడి చేయనుండగా.. `హిట్` మూవీకి సీక్వెల్ గా రూపొందిన `హిట్ః ద సెకండ్ కేస్` జూలై 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి.. వరుస నెలల్లో రాబోతున్న ఈ రెండు చిత్రాలతోనూ అడివి శేష్ విజయాలను అందుకుంటాడేమో చూడాలి.
కాగా, శశికిరణ్ తిక్క దర్శకత్వంలో తయారైన `మేజర్`కి సూపర్ స్టార్ మహేశ్ బాబు ఓ నిర్మాతగా వ్యవహరించగా.. శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తున్న `హిట్ః ద సెకండ్ కేస్`ని వాల్ పోస్టర్ సినిమా పతాకంపై నేచురల్ స్టార్ నాని నిర్మిస్తున్నాడు.
![]() |
![]() |