Home  »  News  »  'సర్కారు వారి పాట' ట్రైలర్.. 'నేను విన్నాను.. నేను ఉన్నాను'

Updated : May 2, 2022

2020 సంక్రాంతికి 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో ప్రేక్షకులను పలకరించిన సూపర్ స్టార్ మహేష్ బాబు రెండేళ్ల తర్వాత 'సర్కారు వారి పాట' సినిమాతో వస్తున్నాడు. పరశురామ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. మే 12 విడుదలవుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. తాజాగా మేకర్స్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ లో మహేష్ తనదైన యాక్షన్, కామెడీ టైమింగ్ తో అదరగొట్టాడు.

'నా ప్రేమని దొంగలించగలరు.. నా స్నేహాన్నీ దొంగలించగలరు.. కానీ నా డబ్బుని దొంగలించలేరు' అంటూ మహేష్ చెప్పే డైలాగ్ తో పాటు భారీ యాక్షన్ ఎపిసోడ్స్ తో 'సర్కారు వారి పాట' ట్రైలర్ ప్రారంభమైంది. మహేష్, కీర్తి, వెన్నెల కిషోర్ మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. 'మీరొక 10 వేల డాలర్లు అప్పిస్తే ఎగ్జామ్ ఫీజ్ కట్టి.. మాస్టర్స్ లో టాప్ స్కోర్ చేస్తాను' అని కీర్తి అడగగా.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్టైల్ లో 'నేను విన్నాను.. నేను ఉన్నాను' అంటూ మహేష్ చెప్పడం ఆకట్టుకుంది. రొమాన్స్, కామెడీ, యాక్షన్ తో ట్రైలర్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ లా ఉంది. ముఖ్యంగా డైలాగ్స్, మహేష్ కామెడీ టైమింగ్ ట్రైలర్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మది సినిమాటోగ్రఫీ టాప్ క్లాస్ లో ఉంది. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎప్పటిలాగే హైలైట్ గా నిలిచింది. 

ట్రైలర్ అంతా 'పోకిరి', 'దూకుడు' సినిమాల స్టైల్ లో పక్కా కమర్షియల్ ప్యాకేజ్ లా ఉంది. అయితే ట్రైలర్ లో ఒకట్రెండు డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నాయి. మహేష్, పరశురామ్ సినిమాలను ఇష్టపడే ఫ్యామిలీ ఆడియన్స్ ని ఇది కాస్త ఇబ్బంది పెట్టే విషయమని చెప్పొచ్చు.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.