![]() |
![]() |

యంగ్ హీరో విశ్వక్ సేన్ పై హైకోర్టు న్యాయవాది అరుణ్ కుమార్ మానవ హక్కుల కమిషన్(హెచ్ఆర్సీ)లో ఫిర్యాదు చేశారు. సినిమా ప్రమోషన్స్ పేరుతో పబ్లిక్ ప్లేస్ లో న్యూసెన్స్ క్రియేట్ చేసిన విశ్వక్ సేన్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
విశ్వక్ సేన్ హీరోగా నటించిన 'అశోకవనంలో అర్జున కళ్యాణం' సినిమా మే 6న విడుదల కానుంది. ఇందులో అల్లం అర్జున్ కుమార్ పాత్రలో విశ్వక్ సేన్ కనిపించనున్నాడు. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ యువకుడితో కలిసి విశ్వక్ సేన్ ఓ ప్రాంక్ వీడియో చేశాడు. అర్జున్ కుమార్ కి పెళ్లి కావట్లేదని మనస్తాపం చెందిన యువకుడు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించినట్లుగా ఆ ప్రాంక్ వీడియోలో ఉంది. అయితే ప్రమోషన్స్ పేరుతో ఇలాంటి వీడియోలు చేయడాన్ని కొందరు తప్పుబడుతున్నారు. ఈ క్రమంలోనే అడ్వకేట్ అరుణ్ కుమార్ హెచ్ఆర్సీలో విశ్వక్ సేన్ పై ఫిర్యాదు చేశారు.
మరోవైపు ఈ వివాదంపై ఓ న్యూస్ ఛానల్ లో డిబేట్ జరగగా.. యాంకర్ కి, విశ్వక్ సేన్ కి మధ్య మాటల యుద్ధం జరిగింది. ప్రాంక్ వీడియోని తప్పుబట్టిన యాంకర్.. హీరో డిప్రెషన్ లో ఉన్నాడు, పాగల్ వంటి మాటలు అనడంతో.. విశ్వక్ సేన్ ఫైర్ అయ్యాడు. ఇద్దరి మధ్య మాట మాట పెరిగింది. ఈ క్రమంలో యాంకర్ 'మా స్టూడియో నుంచి వెళ్ళిపో.. గెటౌట్' అని గట్టిగా అరిచింది. దీంతో సహనం కోల్పోయిన విశ్వక్ సేన్ 'మీరే పిలిచారు.. f***' అని తిడుతూ మైక్ తీసేసి వెళ్ళిపోయాడు.
![]() |
![]() |