![]() |
![]() |

2022 క్యాలెండర్ ఇయర్.. బుట్టబొమ్మ పూజా హెగ్డేకి బొత్తిగా కలిసిరావడం లేదు. చూస్తుండగానే.. కేవలం 50 రోజుల్లో ముచ్చటగా మూడు డిజాస్టర్స్ అమ్మడి ఖాతాలో చేరిపోయాయి. `రాధే శ్యామ్`, `బీస్ట్`, `ఆచార్య`.. ఇలా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూడు బిగ్ టికెట్ ఫిల్మ్స్ కూడా నేల చూపులు చూశాయి. పూజకి కాస్త ఐరెన్ లెగ్ హీరోయిన్ అనే ట్యాగ్ ని మరోసారి సక్సెస్ ఫుల్ గా అందించేశాయి.
ఈ నేపథ్యంలో.. పూజా హెగ్డేకి అర్జెంట్ గా ఓ హిట్ అవసరమైంది. తెలుగులో అయితే.. ఈ అమ్మడు వెంటనే హీరోయిన్ గా కనిపించే అవకాశం దగ్గర్లో లేదనే చెప్పాలి. అటు సూపర్ స్టార్ మహేశ్ బాబుతో చేయబోయే త్రివిక్రమ్ డైరెక్టోరియల్ .. ఇటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ఫస్ట్ టైమ్ రొమాన్స్ చేయనున్న హరీశ్ శంకర్ డైరెక్టోరియల్ `భవదీయుడు భగత్ సింగ్`.. 2023లోనే రాబోతున్నాయి. దీంతో.. 2022లో పూజ నెక్స్ట్ రిలీజ్ గా తను ఐటమ్ సాంగ్ చేసిన `ఎఫ్ 3` మాత్రమే ఉంది. విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ఈ హిలేరియస్ ఎంటర్టైనర్ మే 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి.. కథానాయికగా పూజకి అచ్చిరాని 2022.. ఐటమ్ సాంగ్ విషయంలోనైనా ప్లస్ అవుతుందేమో చూడాలి.
![]() |
![]() |