![]() |
![]() |

ఈ నెల 23 న 'ఆచార్య' ప్రీరిలీజ్ ఈవెంట్ జరగనుందని, ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా రానున్నాడని వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. ఈ న్యూస్ తో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ ఈవెంట్ కి పవన్ వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది.
చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన సినిమా 'ఆచార్య'. రామ్ చరణ్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా ఏప్రిల్ 29 న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏప్రిల్ 23న హైదరాబాద్ యూసఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా ఎవరు రాబోతున్నారనే విషయాన్ని మేకర్స్ తెలపలేదు.

ఏపీ సీఎం వైఎస్ జగన్ గెస్ట్ గా 'ఆచార్య' ఈవెంట్ జరుగుతుందని మొదట వార్తలొచ్చాయి. ఆ తర్వాత జగన్ ప్లేస్ లో పవన్ రానున్నాడని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు పవన్ రావడం కూడా డౌటే అని తెలుస్తోంది. ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ బిజీగా ఉన్న పవన్ ఈ 23 న పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించబోతున్నాడు. అదే రోజు ఆచార్య ఈవెంట్ నిర్వహిస్తున్నారు. పవన్ తన పర్యటన ముగించుకొని సాయంత్రం ఈవెంట్ కి వస్తే బాగుటుందని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. అయితే మేకర్స్ మాత్రం చీఫ్ గెస్ట్ విషయంలో క్లారిటీ ఇవ్వకపోవడంతో ఆచార్య ఈవెంట్ కి పవన్ రావడం డౌటే నన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మరోవైపు ఈ కార్యక్రమానికి రాజమౌళి హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే మహేష్ బాబు లేదా జూనియర్ ఎన్టీఆర్ హాజరైనా ఆశ్చర్యం లేదని అంటున్నారు.
![]() |
![]() |